నల్గొండ: వరి పంట కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వరి కొనుగోళ్లపై కేంద్రం స్పష్టమైన నోటిఫికేషన్ ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. ప్రాజెక్ట్‌లు, కమీషన్లపై ఉన్న శ్రద్ధ రైతుల మీద లేదని ధ్వజమెత్తారు. రూ.1960 మద్దతు ధరకు ప్రతి గింజా కొనుగోలు చేయాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.