ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం

ABN , First Publish Date - 2021-12-09T06:17:11+05:30 IST

రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ దర్శి నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ ధ్వజమెత్తారు.

ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
‘గౌరవసభ’ కార్యక్రమంలో మాట్లాడుతున్న పమిడి

దొనకొండ, డిసెంబరు 8 : రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని టీడీపీ దర్శి నియోజకవర్గం  ఇన్‌చార్జ్‌ పమిడి రమేష్‌ ధ్వజమెత్తారు. మండలంలోని ఆరవళ్లిపాడు గ్రామంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేవ్వరరావు అధ్యక్షతన బుధవారం ‘గౌరవసభ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ..  రాష్ట్రంలో వైసీపీ అరాచకాలకు ఎదురొడ్డి దర్శి నగర పంచాయతీలో టీడీపీ ఘనవిజయం సాధించిందన్నారు. భవిష్యత్తులో ఏ కార్యక్రమం ఎక్కడ జరిగినా ఇదేస్ఫూర్తితో ముందుకు పోవాలన్నారు. వైిసీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. రాజ్యాంగ విరుద్ధంగా పంచాయతీ నిధుల మల్లింపు, చెత్తపై పన్ను వేస్తూ ప్రజలను మరింత ఇబ్బందుల్లోకి నెట్టారన్నారు.  కరోనా విపత్తుతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలపై  ఓటీఎస్‌ పేరుతో గృహ లబ్ధిదారుల నుండి బలవంతపు వసూళ్లులకు పాల్పడుతున్నారన్నారు.  టీడీపీ మండల అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు విబేదాలు విడనాడి ప్రజల్లోకి వెళ్లి వారిని చైతన్య పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో  జడ్పీటీసీ మాజీ సభ్యుడు పులిమి రమణాయాదవ్‌, ఎంపీటీసీ కమ్మా సుబ్బులు, మండల టీడీపీ నాయకులు మోడి వెంకటేశ్వర్లు, కొమ్మతోటి సుబ్బారావు, యగ్గోని యల్లారెడ్డి, యరగొర్ల బసవయ్య, కమ్మా నారాయణ, ఓబులు, నిమ్మకాయల సుబ్బారెడ్డి, వల్లపునేని వెంకటస్వామి, నారాయనరెడ్డి, చెంచయ టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-09T06:17:11+05:30 IST