Abn logo
Aug 8 2020 @ 00:38AM

కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలం

మందమర్రిటౌన్‌, ఆగస్టు 7 : రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను హరించి వేస్తు న్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మున్సిపల్‌ వర్కర్స్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసర్ల రాయలింగు, కార్యదర్శి నర్సయ్యలు మండిపడ్డారు. శుక్రవారం మున్సిపల్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇప్పటికే వైరస్‌ బారి న పడి ప్రజలు కోలు కోలేకపోతున్నారన్నారు. ఆర్థిక వ్యవస్ధ అస్తవ్యస్తంగా తయారైందని, కూలీలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఐలయ్య, శంకరమ్మ, శ్రీను, పోసు,  పాల్గొన్నారు.


కరోనా పరీక్షలు పెంచాలి 

ఏసీసీ: కరోనా కేసులు, మరణాల సంఖ్య పెరు గుతున్న సందర్భంగా కరోనా పరీక్షలు పెంచాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నా రు. ప్రైమరీ కాంటాక్ట్‌ అందరికి టెస్ట్‌లు చేయాల న్నారు. పీహెచ్‌సీలో వారానికి ఐదు రోజులు పరీక్ష లు చేయాలన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న కరోనా బాధితులకు ప్రభుత్వం కిట్‌ను అందజేయా లని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. 


ఆరోగ్యశ్రీలో చేర్చాలి 

జన్నారం : కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాల ని మండల కేంద్రంలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద సీపీఎం నాయకులు ప్ల కార్డులతో నిరసన తెలి పారు.  పోతు శంకర్‌ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీనవర్గాల వారికి సరైన చికిత్స అందక మృత్యువాత పడుతున్నారన్నారు. బుచ్చయ్య, మల్లేశం, లింగన్న, రవి  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement