మచిలీపట్నంలో కొనసాగుతోన్న ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు

ABN , First Publish Date - 2022-01-31T19:34:48+05:30 IST

మచిలీపట్నంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతోన్నాయి. జీతాల చెల్లింపు విధుల్లో పాల్గొనబోమని సిబ్బంది తేల్చిచెప్పారు.

మచిలీపట్నంలో కొనసాగుతోన్న ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు

మచిలీపట్నం: మచిలీపట్నంలో ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలు కొనసాగుతోన్నాయి. జీతాల చెల్లింపు విధుల్లో పాల్గొనబోమని సిబ్బంది తేల్చిచెప్పారు. జగన్ సర్కార్ ఉద్యోగులను మోసం చేసిందని ప్రభుత్వ ఉద్యోగులు మండిపడుతున్నారు. తమ హక్కులను కాలరాసినా ప్రశ్నించకూడదని చెబుతోందని, జగన్ చేసింది న్యాయమైతే అర్ధరాత్రి చీకటి జీవోలు ఎందుకిచ్చారు? అని ప్రశ్నించారు. 12సార్లు చర్చలకు వచ్చినా.. ఆ హామీల ప్రకారం పీఆర్సీ ఎందుకివ్వలేదు? అని ప్రశ్నించారు. జీతాలు తగ్గించి.. న్యాయం చేశామనడం ఎక్కడైనా చూశారా అని ఉద్యోగులు నిలదీశారు. వచ్చే నెల 3న ఛలో విజయవాడ, 7 నుంచి సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కమిటీలు కాదని, సీఎం స్వయంగా స్పందించి న్యాయం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2022-01-31T19:34:48+05:30 IST