మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వ కృషి

ABN , First Publish Date - 2022-08-17T05:28:02+05:30 IST

మహిళలు ఇంట్లోనే ఉండి ఉపాధి పొందేలా రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తుందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు.

మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వ కృషి
కుట్టుమిషన్లను పంపిణీ చేసిన మంత్రి

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 

నిర్మల్‌ చైన్‌గేట్‌, ఆగస్టు 16 : మహిళలు ఇంట్లోనే ఉండి ఉపాధి పొందేలా రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తుందని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. జిల్లాలోని అంబేద్కర్‌భవన్‌లో జిల్లాలోని ఎస్సీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ మహిళలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. 93 మంది ఎస్సీ నిరుద్యోగ అభ్యర్థులకు మంగళవారం మంత్రి కుట్టుమిషన్‌లను, ధ్రువీ కరణ పత్రాలను పంపిణీ చేశారు. టైలరింగ్‌, బ్యూటీషియన్‌ కోర్సు పూర్తి చేసుకున్న 33 మంది అభ్యర్థులకు సర్టిఫికెట్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సెల్ఫ్‌ ఎంప్లాయిమెంట్‌ పథకం ద్వారా మహిళలకు మూడునెలలు శిక్షణ ఇచ్చారని అన్నారు. ఇప్పటి వరకు జిలా ్లలో మొత్తం 349 మంది నిరుద్యోగ యువతీ యువకులకు వారు కోరుకున్న కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు. దీంతో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి రాంకిషన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, తెరాస పట్టణ అధ్యక్షుడు మారు గొండ రాము, నిర్మల్‌ ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, తెరాస అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, నాయకులు పాకాల రాంచందర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హనుమండ్లు, కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు. 

స్వాతంత్య్ర సాధనలో కవుల పాత్ర కీలకం

నిర్మల్‌ కల్చరల్‌, ఆగస్టు 16 : స్వాతంత్య్ర సాధనలో కవుల పాత్ర కీలకమని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి కొనియాడారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం కలెక్టర్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన కవి సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ... కవులు స్వాతంత్య్ర సిద్ధికి కవిత్వం తో ప్రజలను చైతన్య పర్చారన్నారు. ఎందరో త్యాగధనుల ఫలితంగానే స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని పెంపొందించేం దుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం కవులు కళాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. తెలుగు, ఉర్దూ భాషల్లో సుమారు వంద మంది కవితాగానం చూసి సాహితీ ప్రియులను అలరించారు. కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, పి. రాంబాబు, చైర్మన్‌ ఈశ్వర్‌, డీఈవో రవీందర్‌ రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-17T05:28:02+05:30 IST