ముదిరాజ్‌ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-01-16T04:13:08+05:30 IST

ముదిరాజ్‌ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు ముల్కేపల్లి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మత్స్య సహకార సంఘంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.

ముదిరాజ్‌ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ర్యాలీ నిర్వహిస్తున్న ముదిరాజ్‌ మహాసభ నాయకులు

మంచిర్యాల కలెక్టరేట్‌, జనవరి 15: ముదిరాజ్‌ల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ జిల్లా అధ్యక్షుడు ముల్కేపల్లి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. మత్స్య సహకార సంఘంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంపై ఐబీ చౌరస్తాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ప్రభుత్వం ముదిరాజ్‌లోని ముత్తరాసు, తెనుగు, గంగపుత్ర గూండ్ల వారికి 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరికి మత్స్య సహకార సంఘం సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించడం హర్షనీయమని, మత్స్యకారు లు ఎదుర్కొంటున్న సొసైటీ సభ్యత్వ సమస్యను  పరి ష్కరించే విధంగా ప్రభుత్వం పూనుకొని అర్హులైన ముదిరాజ్‌లకు సభ్యత్వాన్ని కల్పించడం ఇన్నాళ్ళ పోరాట ఫలితమన్నారు. మత్స్య శాఖ ద్వారా అందిస్తు న్న సంక్షేమ పథకాలు మరింత చేరువై ప్రతీ ఒక్క నిరు పేదకు న్యాయం జరుగుతుందన్నారు.  జిల్లా ప్రధాన కార్యదర్శి పేట మల్లయ్య, ఉపాధ్యక్షుడు దండవేని భాస్కర్‌, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తిరుమలేష్‌, మహిళ అధ్యక్షురాలు తిరుమల, మంజులా వాణి, కల్యాణి, పోలు కిష్టయ్య, రవీందర్‌, లక్ష్మినారాయణ తదితరులు పాల్గొన్నారు. 

బెల్లంపల్లి: ముదిరాజ్‌, గంగపుత్రులకు రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో సభ్యత్వం కల్పిస్తామ ని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రకటిం చడంపై ముదిరాజ్‌ మహాసభ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం పట్టణంలో ర్యాలీ నిర్వహిం చి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ల  చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.  చిం తల రమేష్‌, తాళ్ల  కిష్టమోహన్‌, బానేష్‌, పోలు శ్రీని వాస్‌, తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-16T04:13:08+05:30 IST