Abn logo
Jun 21 2021 @ 23:31PM

కురుమల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ

చిన్నకోడూరు, జూన్‌ 21 : కురుమల సంక్షేమానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నదని జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో కురుమ సంఘం భవనం, బీరప్ప ఆలయం నిర్మాణానికి ఆమె భూమి పూజచేసి మాట్లాడారు. కురుమ సంఘం భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు రూ.5 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకోని అందుబాటులోకి తెచ్చుకోవాలని కురుమ సంఘం సభ్యులకు సూచించారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మను సంఘం సభ్యులు శాలువాతో సన్మానించారు. ఎంపీపీ మాణిక్యరెడి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఉమే్‌షచంద్ర, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, కోఆప్షన్‌ మెంబర్‌ సాదక్‌, సంఘం అధ్యక్షుడు కిష్టయ్య, ఉపాధ్యక్షుడు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.