మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2020-10-01T09:26:48+05:30 IST

మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభు త్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం కృషి

ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపల్‌ చైర్మన్లు పావని, కొండల్‌రెడ్డి


ఘట్‌కేసర్‌ : మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభు త్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఘట్‌కేసర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముల్లి పావనియాదవ్‌, పోచారం మున్సిపల్‌ చైర్మన్‌ బోయపల్లి కొండల్‌రెడ్డి అన్నారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ పరిధిలోని పులిచరకుంటలో చైర్‌పర్సన్‌, ముల్లి పావని, పోచారం పరిధిలోని మిరాళం  కుంటలో బుధవారం వేర్వేరుగా చేపపిల్లలను వదిలారు. అనంతరం వారు మాట్లాడారు. ఈసందర్బంగా అన్నోజిగూడ విరాళం  కుంటలో 12 వేలు, పైలిచర కుంటలో 10 వేల పిల్లలను వదిలారు. ఆయా కార్యక్రమాల్లో వైస్‌ చైర్మన్‌ నానావత్‌ రెడ్యానాయక్‌, కౌన్సిలర్లు జి.మహెష్‌, బి..వెంకటేష్‌, సాయిరెడ్డి, రాజశేఖర్‌, సింగిల్‌విండో డైరక్టర్‌ చందుపట్ల దర్మారెడ్డి, నాయకులు బొక్క ప్రభాకర్‌రెడ్డి, ఎంపాల సుధాకర్‌రెడ్డి, కంభం హరికిషన్‌రెడ్డి, రాంచందర్‌రెడ్డి, బాల్‌రాజ్‌, జయ్‌పాల్‌రెడ్డి, ఎం వెంకటేష్‌ పాల్గొన్నారు. 


మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి

శామీర్‌పేట : చేపల పెంపకం ద్వారా మత్స్యకారులు ఉపాధి పొంది ఆర్థికంగా ఎదగాలని శామీర్‌పేట సర్పంచ్‌ గీతా మహేందర్‌ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని బొమ్మరాశిపేట పెద్ద చెరువులో విత్తన చేప పిల్లలను వదిలారు. అనంతరం ఆమె మాట్లాడుతూ  సుమారు 83వేల చేప పిల్లలను చెరువులో వదిలినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఇందిర, వార్డు మెంబర్‌ విమల, స్రవంతి, కుమార్‌, తలారి మహేందర్‌, ఏసుదాసు పాల్గొన్నారు.   

Updated Date - 2020-10-01T09:26:48+05:30 IST