చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2022-08-08T05:53:32+05:30 IST

చేనేత కార్మికుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు.

చేనేత కార్మికుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి
పోచంపల్లిలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్‌రెడ్డి

భూదాన్‌పోచంపల్లి, ఆగస్టు 7: చేనేత కార్మికుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని భూదాన్‌పోచంపల్లిలోని చేనేత టైఅండ్‌డై అసోసియేషన్‌ భవనంలో చేనేత పనిలో నైపుణ్యత కలిగిన చేనేత కార్మికులకు ఆదివారం సన్మానించారు. కార్యక్రమంలో భూదాన్‌పోచంపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టిపోలు విజయలక్ష్మీశ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామియాదవ్‌, ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత మల్లారెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు గుండు మధు, కర్నాటి రవీందర్‌, సామల మల్లారెడ్డి, దారెడ్డి మంజుల వేణుగోపాల్‌రెడ్డి, చేనేత నాయకులు రుద్ర శ్రీశైలం, గుజ్జ సత్యం తదితరులు పాల్గొన్నారు. 

ఆలేరు: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం అధ్యక్షుడు బింగి నర్సిం హులు, బడుగు జహాంగీర్‌, పరమేశ్వర్‌, మాజీ సర్పంచ్‌లు చింతకింది ము రళి, సంతోష్‌, కౌన్సిలర్‌  బేతి రాములు, ఆడెపు బాల స్వామి, నాయకులు శంకర్‌, భానుచందర్‌, చిక్క శ్రావణ్‌, అశోక్‌, వెంకటేష్‌, మల్లేష్‌ పాల్గొన్నారు. బీజేపీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో చేనేత కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో నాయకులు బడుగు జహాంగీర్‌, పులిపలుకుల మహేష్‌, కటకం రాజు, పడాల శ్రీనివాస్‌, రాజు, సముద్రాల కల్పన పాల్గొన్నారు. 

మోత్కూరు: చేనేత వస్త్రాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ రద్దు చేయాలని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పాశికంటి లక్ష్మీనర్సయ్య కోరారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మోత్కూరు ఇక్కత్‌ చేనేత క్లస్టర్‌ ఎదుట జాతీయ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో వీవర్స్‌ సర్వీస్‌ సెంటర్‌ ప్రతినిధి శ్రీకాంత్‌, స్ఫూర్తి చైర్మన్‌ మంచె గోవర్థన్‌, జెల్దిరాములు, కొక్కుల సత్యనారాయణ, సంఘం మేనేజర్‌ వేముల నర్సయ్య పాల్గొన్నారు. 

చౌటుప్పల్‌రూరల్‌: మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో జాతీయ దినోత్సవం నిర్వహించారు. చేనేత సంఘం రాష్ట్ర నాయకుడు, మాజీ జడ్పీటీసీ బొల్ల శివశంకర్‌ మాట్లాడుతూ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని నియోజకవర్గ పరిధిలోని అన్ని చేనేత సహకార సంఘం కార్మికులకు వైద్య చికిత్సలు, కంటి చికిత్స, అద్దాల పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో గడ్డం జయశంకర్‌, ఎంపీటీసీ ఈశ్వరమ్మవెంకటేశం, మాజీ సర్పంచ్‌ మాచర్ల కృష్ణ, పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బోనగిరి గిరిష్‌, గుర్రం వెంకటేశం పాల్గొన్నారు. 

వలిగొండ : జాతీయ చేనేత దినోత్సవాన్ని మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు అయిటి పాముల  ప్రభాకర్‌, గంజి నారాయణ, జంట శంకరయ్య, మిర్యాల శ్రీని వాస్‌, రచ్చ సంతోష్‌ వంగరి రమేష్‌, గంజి వెంకటేష్‌, జగన్‌ పాల్గొన్నారు. 

రాజాపేట: మండలంలోని రఘునాథపూర్‌ గ్రామంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు బుద్దుల వెంకటేశం, కటకం వెంకటేశం, శ్రవణ్‌, బాలరాజు, రమేష్‌, బాబు, తదితరులు పాల్గొన్నారు. 

రామన్నపేట: చేనేత కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పట్టణం లో ర్యాలీ నిర్వహించారు. గాంధీ, కొండ లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీఎంఎస్‌ మాజీ జిల్లా డైరెక్టర్‌ జెల్ల వెంకటేశ్‌, రచ్చ యాదగిరి, సురపల్లి యాదగిరి, కైరం కొండ నాగభూషణం, పెండం వేణు, బోడ సుదర్శన్‌, దోంత నాగరాజు, వనం అంజయ్య, అశోక్‌, శ్రీరామ్‌, నారాయణ, సత్తయ్య, వెంకటేష్‌, నాగభూ షణం, శ్రీను, లక్ష్మణ్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T05:53:32+05:30 IST