సాధికారతకు సర్కారు కృషి: సునీతా లక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2021-03-08T08:55:42+05:30 IST

మహిళా బిల్లుతోనే మహిళా సాధికారత సాధ్యపడుతుందని పలువురు వక్తలు అన్నారు.

సాధికారతకు సర్కారు కృషి: సునీతా లక్ష్మారెడ్డి

‘ముద్ర’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

రాంనగర్‌, మార్చి 7 (ఆంధ్రజ్యోతి): మహిళా బిల్లుతోనే మహిళా సాధికారత సాధ్యపడుతుందని పలువురు వక్తలు అన్నారు. ఆదివారం బాగ్‌లింగంపల్లిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ముద్ర అగ్రికల్చర్‌ స్కిల్‌ డెవల్‌పమెంట్‌ మల్టీ స్టేట్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ ఆధ్వర్యంలో ‘చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్లు, ఉపాధి అవకాశాలు, సద్వినియోగం’ అంశంపై చర్చా వేదిక జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళా సాధికారతకు తగిన చర్యలు చేపట్టిందన్నారు. మహిళలపై హింసలేని సమాజానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ జి.చంద్రయ్య అన్నారు. మహిళా బిల్లుతోనే వారికి సమన్యాయం జరుగుతుందని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ బి.చంద్రకుమార్‌, బీసీ కమిషన్‌ పూర్వ సభ్యుడు డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అభిప్రాయపడ్డారు.

Updated Date - 2021-03-08T08:55:42+05:30 IST