కాకతీయుల చరిత్రను తెలిపేందుకే కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలు: Vinay

ABN , First Publish Date - 2022-07-06T16:13:03+05:30 IST

కాకతీయుల గొప్ప చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకే కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.

కాకతీయుల చరిత్రను తెలిపేందుకే కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలు: Vinay

హనుమకొండ: కాకతీయుల గొప్ప చరిత్రను భావితరాలకు తెలియజేసేందుకే కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ (Vinay bhaskar) తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ... రేపు ఉదయం 8 గంటలకు కాకతీయ వారసుడు కమల్ చంద్ భంజ్ దేవ్(Kamal Chand Bhanj Dev) వరంగల్‌కు వస్తారని, భద్రకాళీ అమ్మవారి ఆలయం దగ్గర భారీ స్వాగత ఏర్పాట్లు చేశామని చెప్పారు. భద్రకాళీ అమ్మవారి దర్శనం అనంతరం పోచంమైదాన్‌లో రాణిరుద్రమ విగ్రహానికి పూలమాలలు వేస్తారన్నారు. అనంతరం ఖిలా వరంగల్, వేయిస్తంబాల గుడి, ఆగ్గిలయ్య గుట్టను సందర్శిస్తారని ఆయన తెలిపారు. భోజన విరామం అనంతరం హైదరాబాద్‌కు వెళ్లనున్నట్లు చెప్పారు. మాదాపూర్‌లోని ఆర్ట్స్ గ్యాలరీలో 777 కాకతీయ రాజుల ఫోటో ఎగ్జిబిషన్ సందర్శిస్తారన్నారు. ఏడు రోజుల పాటు సాంస్కృతిక, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.13న రామప్పలో కాకతీయ వైభవ సప్తాహం ఉత్సవాల ముగింపు సభ నిర్వహిస్తామని వినయ్ భాస్కర్ వెల్లడించారు. 

Updated Date - 2022-07-06T16:13:03+05:30 IST