అద్దెకు ప్రభుత్వ బస్సులు

ABN , First Publish Date - 2021-05-17T13:24:40+05:30 IST

కరోనా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో, అనుమతులు పొందిన వివాహాలు, అంత్యక్రియలకు కాంటాక్ట్‌ పద్ధతిన బస్సులు అద్దెకు

అద్దెకు ప్రభుత్వ బస్సులు

చెన్నై/పెరంబూర్: కరోనా సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలులో ఉన్న నేపథ్యంలో, అనుమతులు పొందిన వివాహాలు, అంత్యక్రియలకు కాంటాక్ట్‌ పద్ధతిన బస్సులు అద్దెకు ఇవ్వనున్నాట్లు రాష్ట్రప్రభుత్వ రవాణా సంస తెలిపింది. ఈ మేరకు ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో, లాక్‌డౌన్‌ కారణంగా ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సేవలు పూర్తిగా రద్దయ్యాయని తెలి పింది. ఈ నేపథ్యంలో, వివాహాలు, అంత్యక్రియలు, వైద్యం తదితర అత్య వసర పనులకు తగిన అనుమతులు ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ బస్సులను కాంటాక్ట్‌ పద్థతిలో అద్దెకు ఇవ్వనున్నామని పేర్కొంది. ఈ సేవలు పొందగోరు వారు చెన్నై మెట్రో రవాణా సంస్థ (9445030523), ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థ (9445014416), విల్లుపురం (9445021206), కోయంబత్తూర్‌ (9442268635), కుంభకోణం (9487995529) నెంబర్లు లో సంప్రదించాలని రవాణా శాఖ తెలియజేసింది.

Updated Date - 2021-05-17T13:24:40+05:30 IST