పునాదుల్లోనే ప్రభుత్వ భవనాలు

ABN , First Publish Date - 2022-05-27T05:50:03+05:30 IST

ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, గ్రా మీణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటుచేసి వాటికి పూర్తి స్థాయి భవనాలను నిర్మించేందుకు నిధులు మంజూ రు చేసింది.

పునాదుల్లోనే ప్రభుత్వ భవనాలు
పర్చూరులోని ఇందిరా కాలనీలో బేస్‌మెట్‌ దశలోనే నిలిచిన సచివాలయ భవనం

అరకొర వసతుల అద్దె భవనాల్లో అవస్ధలు

నేటికీ పూర్తిస్థాయిలో కాంట్రాక్టర్లకు అందని బిల్లులు

పునలు పునఃప్రారంభానికి ముందుకు రాని వైనం

గ్రామ సచివాలయాలు,  రైతుభరోసా కేంద్రాల తీరుఇది

పర్చూరు, మే 26: ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు,  గ్రా మీణ ఆరోగ్య కేంద్రాలను  ఏర్పాటుచేసి వాటికి పూర్తి స్థాయి భవనాలను నిర్మించేందుకు నిధులు మంజూ రు చేసింది. పలు గ్రామాల్లో కొందరు నేతలు ఉత్సా హంతో ఈభవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ప్రభుత్వం మాత్రం సకాలంలో బిల్లులు చెల్లించకపోవ టంతో కొన్ని నెలలుగా గ్రామాల్లో రైతుభరోసా కేంద్రా లు, సచివాలయాలు, గ్రామ ఆరోగ్య కేంద్రాలు పూర్తి స్ధాయిలో నిలిచిపోయాయి. కొన్ని చోట్ల పునాధులకే పరిమితం కాగా మరికొన్ని చోట్ల స్లాబ్‌లు వేసి నిలిచి ఉన్నాయి. నెలల తరబడి పనులు చేపట్టకపోవటంతో వినియోగంలోకి రాకముందే ప్రభుత్వ భవనాలు పాడ వుతున్నాయి. ఇప్పటివరకు సచివాలయాలు, రైతుభరో సా కేంద్రాలు, ఆరోగ్య కేంద్ర భవనాల నిర్మాణం కోసం లక్షల రూపాలయ నిధులు వెచ్చించి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించిన దాఖ లాలు లేవు. ఏడాదిన్నర కాలం గడుస్తున్న నేటీకీ పూ ర్తిసాయిలో చెల్లించకపోవటంతో తిరిగి పనులు చేపట్ట డానికి కాంట్రాక్టర్లు ఆసక్తి చూపటం లేదని పలువురు అంటున్నారు.


భారంగా మారిన సిమెంట్‌, ఐరన్‌ రేట్లు

సిమెంట్‌, ఐరన్‌,  ధరలు భారీగా పెరగడంతో వ్య య భారం అధికమవుతుందని కాంట్రాక్టర్లు వాపోతు న్నారు. వ్యయప్రయాసలకు ఓర్చి నిర్మాణాలు చేపట్టి నా బిల్లులు సకాలంలో అందుతాయో, లేదోనన్న సంది గ్ధంలో కాంట్రాక్టర్లు ఉన్నారు. దీంతో తిరిగి పనులు మొదలుపెట్టేందుకు కాంట్రాక్టర్లు వెనుకడుగు వేస్తు న్నారు. ఉన్నతాధికారులు త్వరితగతిన నిర్మాణాలు పూ ర్తిచేయించాలని అధికారులను ఆదేశిస్తున్నారు. దీంతో వారి పరిస్థితి ముందునుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఉంది.

పర్చూరు నియోజకవర్గంలోని పర్చూరు, కారంచే డు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు, యద్దనపూడి మండలాల పరిధిలో మొత్తం 96 గ్రామ పంచాయ తీలకు గాను 83 సచివాలయాలు, 87 రైతుభరోసా కేంద్రాలు, 76 గ్రామీణ ఆరోగ్యకేంద్రాలు మంజూర య్యాయి. నిర్మాణ పనులు చేపట్టి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా నేటికీ పూర్తికాని పరిస్థితి. పర్చూరు మం డలంలోని అడుసుమల్లి గ్రామంలో ఒక సచివాలయం, ఇంకొల్లు మండలం వంకాయలపాడు గ్రామంలో మరో సచివాలయం మాత్రమే నిర్మాణ పనులు పూర్తికావ టం విశేషం. 

నియోజకవర్గంలోని అనేకచోట్ల పనులు పూర్తికాక ముందే పాడవుతున్నాయి. భవనాల నిర్మాణాలకోసం వినియోగించిన ఇనుప సువ్వలు తుప్పుపడుతున్నా యి.  పర్చూరులోని ఇందిరా కాలనీ, రెవెన్యూ కార్యాల యం సమీపంలో నిర్మాణం చేట్టిన రైతుభరోసా కేం ద్రం, సచివాలయం బేస్‌ మేట్‌కే పరిమితం కావటంతో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది.


త్వరితగతిన నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు

- సీహెచ్‌ శ్యాంప్రసాద్‌, పీఆర్‌ డీఈఈ

ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వివిధ దశల్లో ఉ న్నాయి. సచివాలయాలకు సంబంధించి రెండు భవ నాలు పూర్తికాగా, 19 భవనాలకు స్లాబ్‌లు వేశారు. మి గిలిన భవనాలను కూడా త్వరితగతిన పూర్తిచేసే వి ధంగా చర్యలు తీసుకుంటాం. 

Updated Date - 2022-05-27T05:50:03+05:30 IST