సానుకూల తీర్పుపై సర్కారు గంపెడాశలు!

ABN , First Publish Date - 2021-01-24T08:06:09+05:30 IST

: పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీకి సహాయ నిరాకరణ చేస్తున్న రాష్ట్రప్రభుత్వం.. సోమవారం సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇస్తుందని ఆశాభావంతో ఉంది.

సానుకూల తీర్పుపై సర్కారు గంపెడాశలు!

  • అలాగైతే నిమ్మగడ్డ హయాంలోఎన్నికలు ఉండవ్‌!!
  • తమ పంతం నెరవేరుతుందని ప్రభుత్వ పెద్దల మనోగతం
  • ప్రతికూల తీర్పుపై  మల్లగుల్లాలు!


అమరావతి, జనవరి 23(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల నిర్వహణలో ఎస్‌ఈసీకి సహాయ నిరాకరణ చేస్తున్న రాష్ట్రప్రభుత్వం.. సోమవారం సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇస్తుందని ఆశాభావంతో ఉంది. దాంతో కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ హయాంలో ఎన్నికలు జరపకూడదన్న తమ పంతం నెరవేరుతుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. అయుతే ఇప్పటికే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా జారీ అయినందున సర్వోన్నత న్యాయస్థానం ఎంతవరకు జోక్యం చేసుకుంటుందోనన్న ఆందోళనా వారిలో నెలకొందని చెబుతున్నాయి. ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తే ఏం చేయాలన్న అంశంపై వారు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. నోటిఫికేషన్‌ విడుదల చేస్తూ ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని ఎస్‌ఈసీ ప్రభు త్వ యంత్రాంగాన్ని కోరినా సానుకూలంగా స్పం దించలేదు.


 వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, పంచాయతీరాజ్‌ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, పం చాయతీరాజ్‌ కమిషనర్‌ గిరిజా శంకర్‌, కలెక్టర్లు పాల్గొనకపోవడంపై కొందరు అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వీడియో కాన్ఫరెన్స్‌ను వా యిదా వేయాలని.. సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చేవర కు ఆగాలని కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు సీఎస్‌ శనివారం లేఖ రాశారు. అటు కొం దరు మంత్రులు, అధికార పక్ష నేతలు నిమ్మగడ్డపై వ్యక్తిగత విమర్శల దాడి చేస్తూనే.. ఉద్యోగ సంఘాల నేతలనూ ఉసిగొల్పుతున్నారు. తొలుత వ్యాక్సినేషన్‌ పూర్తయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని సంఘాల నాయకులు వాదిస్తున్నారు. వారి వైఖరిపై సుప్రీంకోర్టు ఏమంటుందోనన్న ఆందోళన ఉద్యోగ వర్గాల్లోనూ ఉంది. ఏది ఏమైనా సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రభుత్వానికి ప్రతికూలంగా వస్తే.. ఇష్టమున్నా లేకున్నా స్థాని క ఎన్నికలను నిర్వహించక తప్పదని.. ఉద్యోగులూ కచ్చితంగా ఆ ప్రక్రియలో పాల్గొనాల్సిందేనని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-01-24T08:06:09+05:30 IST