పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు: అవంతి

ABN , First Publish Date - 2021-10-11T03:08:09+05:30 IST

రాష్ట్రంలో 60 శాతం మంది పేద ప్రజలు వున్నారని, వారికి సంక్షేమ పథకాలను అమలుచేయడం కోసమే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు

పేదల సంక్షేమం కోసమే ప్రభుత్వ ఆస్తులు తాకట్టు: అవంతి

విశాఖ: రాష్ట్రంలో 60 శాతం మంది పేద ప్రజలు వున్నారని, వారికి సంక్షేమ పథకాలను అమలుచేయడం కోసమే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడుతున్నామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా కారణంగా ప్రభుత్వ ఆదాయం బాగా తగ్గిపోయిందని, ఇదే సమయంలో కరోనా బాధితుల కోసం రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.  సీఎం జగన్మోనరెడ్డి బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పనిచేస్తూ నిజమైన కమ్యూనిస్టు అనిపించుకుంటున్నారని ఆయన కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, రాష్ట్రం దివాలా తీసిందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని శ్రీనివాస్ ఆరోపించారు.

Updated Date - 2021-10-11T03:08:09+05:30 IST