Abn logo
Apr 23 2021 @ 01:16AM

ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు ప్రభుత్వ సహాయం

- కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ

కాల్వశ్రీరాంపూర్‌, ఏప్రిల్‌ 22: ప్రైవేట్‌ ఉపాధ్యాయులకు కరోనా కారణంగా ప్రైవేట్‌పాఠశాలు మూసివేయడంతో ప్రభుత్వం సహాయం చేస్తుం దని కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని రేషన్‌ దుకాణంలో ప్రైవేట్‌ ఉపాధ్యాయని ఉపాఽద్యాయులకు ఒక్కొక్కరికి 25కిలోల సన్నబియ్యంను కలెక్టర్‌ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ వలన ప్రైవేట్‌ పాఠశాలలు మూతపడడంతో ఆ పాఠశాలల్లో పనిచేసే టీచర్లు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గమనించి వారికి రెండు వేల నగదుతో పాటు 25కిలోల బియ్యం పాఠశాలలు ప్రారంభమయ్యే వరకు ప్రభుత్వం అందిస్తుందన్నారు. జిల్లా లో సుమారు 3వేల మంది, మండలంలో 59మందికి నెలనెల ఇవ్వనున్న ట్టు తెలిపారు. గ్రామాల్లో 45సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్‌ వ్యాక్సి్‌ వేసుకునేందుకకు ప్రజా ప్రతినిధులు సహకరించాలన్నారు. గ్రామ గ్రామాన క్యాంపులు ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో అందరికి వ్యాక్సిన్‌ వే యనున్నట్టు తెలిపారు. గ్రామ ప్రజలందరూ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకోవాల ని ఈ సందర్భంగా సూచించారు. అనంతరం కూనారం గ్రామంలో ప్రైమ రీ హెల్త్‌ సెంటర్‌లో కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్యాంపును సందర్శించారు. వ్యాక్సిన్‌ గురించి డాక్టర్‌ మహేందర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామం లో రెండు రోజుల్లో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని డాక్టర్‌కు సూచించారు. జాఫర్‌ఖాన్‌పేటలో క్రిమ్‌టోరియం, పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. క్వాల శ్రీరాంపూర్‌లో గ్రామపంచాయతీ ఇబ్బందిపడుతున్నామని సర్పంచ్‌ ఆడెపు శ్రీదేవిరాజు కలెక్టర్‌కు వివరించారు. 50ఏళ్లుగా గ్రామ పంచాయతీ ఉన్న స్థలంలో ఈజీఎస్‌లో కొంత మేర పూర్తయ్యిందని సర్పంచ్‌ కలెక్టర్‌ కు తెలిపారు. ఈ భూమి తమదంటూ ఒకరు పట్టా చేసుకోవడం వల్ల ఇంత పెద్దగ్రామంలో ఇంతవరకు జీపీ భవనం లేదన్నారు. ఈ విషయం పై స్పందించిన కలెక్టర్‌ జీపీ భవన స్థలంపై పూర్తి సమాచారం అందిం చాలని తహసీల్దార్‌ సునీతను కలెక్టర్‌ను ఆదేశించారు. 

Advertisement
Advertisement