Abn logo
Aug 10 2020 @ 22:55PM

యూఏఈలో ఐపీఎల్‌కు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్: బీసీసీఐ

న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగాల్సిన ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ లభించినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ విషయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేష్ పటేల్ సోమవారం వెల్లడించారు. యూఏఈలో ఐపీఎల్ నిర్వహణకు సమస్యలేవీ లేవని ప్రభుత్వం చెప్పినప్పుడే యూఏఈ క్రికెట్ బోర్డుకు తాము సమాచారం అందించామని ఆయన చెప్పారు. ఇప్పుడు తమకు అధికారికంగా ప్రభుత్వ అనుమతి పత్రాలు లభించినట్లు చెప్పారు. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 2020 నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement
Advertisement