Sajjala comments: చంద్రబాబు చరిత్ర హీనుడు

ABN , First Publish Date - 2022-07-29T18:28:05+05:30 IST

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం, ప్రత్యేక హోదా కోసం ఎందుకు రాజీనామా చేయలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు.

Sajjala comments: చంద్రబాబు చరిత్ర హీనుడు

గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు పోలవరం, ప్రత్యేక హోదా కోసం ఎందుకు రాజీనామా చేయలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు (chandrababu) చరిత్ర హీనుడు అని... ప్రజలు చెత్త బుట్టలో పడేశారని వ్యాఖ్యలు చేశారు. సీఎం ఆచరణాత్మకమైన ప్రణాళికతో పోలవరం (Polavaram) ఆర్ అండ్ ఆర్‌పై ప్రకటన చేశారని తెలిపారు. కేంద్రం నుండి నిధులు రావటం లేటైనా 41.5 అడుగుల వరకూ ఆర్ అండ్ ఆర్ తాను ఇస్తాను అని సీఎం చెప్పారన్నారు. 45.5 అడుగుల వరకూ పూర్తిగా నీటిని నింపాలంటే రెండేళ్ళు పడుతుందని... ఈలోపు కేంద్రం నుండి నిధులు తీసుకొస్తామ‌న్నారని తెలిపారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తేనో, ఆర్ అండ్ ఆర్ ఇవ్వకుండా నీటిని నింపితేనో గగ్గోలు పెట్టాలని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 

Updated Date - 2022-07-29T18:28:05+05:30 IST