పాలకమండలి సమావేశం మరోసారి వాయిదా

ABN , First Publish Date - 2022-08-08T05:11:29+05:30 IST

శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం పాలకమండలి సమావేశం మరోసారి వాయిదా పడింది.

పాలకమండలి సమావేశం మరోసారి వాయిదా
శింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయం

చైర్మన్‌కు తెలియకుండా ఏర్పాటు

బంధువు చనిపోవటంతో వాయిదా    

వేస్తున్నట్లు  సభ్యులకు సమాచారం ఇచ్చిన ఈవో

 అద్దంకి, ఆగస్టు7: శింగరకొండ శ్రీప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం పాలకమండలి సమావేశం మరోసారి వాయిదా పడింది. ఇప్పటికే చైర్మన్‌, ఈవోల మధ్య అంతర్యుద్ధం కొన సాగుతుండగా సమావేశం వాయిదా పడటం చర్చనీయాం శంగా మారింది.  తనకు తెలియకుండానే ఈవో సొంతం గా అజెండా తయారుచేసి ఈనెల 2న పాలకమండలి సమావేశం ఏర్పాటుచేసినట్లు చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌ తెలిపారు. అయితే, మొత్తం 9 మంది సభ్యులకుగాను నలుగురు మాత్రమే హాజ రుకావటంతో కోరం లేక వాయిదా వేసినట్లు ఈవో రఘునాధరెడ్డి ప్రకటించారు. మరలా సమావేశం ఏర్పాటు గురించి తనకు తెలియ కుండానే  7వ తేది ఏర్పాటుచేస్తున్నట్లు ఈవో ప్రకటించారని చైర్మన్‌ శ్రీనివాస కుమార్‌ ఆరోపిస్తున్నారు. అయితే, అనూహ్యంగా ఆదివారం కూడా సమావేశం  జరగకుండానే మరోసారి  వాయిదా పడింది. 

చైర్మన్‌ కోట శ్రీనివాసకుమార్‌ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం కర్నాటక రాష్టంలోని ఓ దేవాలయం వద్ద జరిగే శుభాకార్యానికి వెళ్ళా రు. కోరంకు సరిపడా సభ్యులు హాజరైతే సమావేశం నిర్వహిస్తారని అందరూ భావించారు. ఆదివారం ఉదయం ఈవో రఘునాధరెడ్డి కొం తమంది పాలకమండలి సభ్యులకు ఫోన్‌చేసి దగ్గరి బంధువు  ఆరోగ్య పరిస్థితి  ఆందోళనకరంగా ఉం దని, సమావేశం వాయిదా వే స్తున్నట్లు తెలిపారు. సాయం త్రం 430 గంటల సమయంలో పత్రికలకు విడుదల చేసిన ప్ర కటనలో మాత్రం సమావేశా నికి సభ్యులు హాజరుకాకపోవ టంతో వాయిదా వేసినట్లు ప్రక టించారు. 

ఈ ప్రకటన చూసిన పలు వురు పాలకమండలి సభ్యులు అ వాక్కయ్యారు. సమావేశం వాయిదా వేస్తున్నట్లు చెప్పి తీరా సభ్యులు గైర్హాజరుతో దర్మకర్తల మండ లి సమావేశం వాయిదా వేసినట్లు ప్రకటించటం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోరం లేక గత సమావేశం వాయిదా పడ్డ తరువాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాల నేపథ్యంలో ఈవో వ్యూహాత్మకంగా వ్యవహరించి సమా వేశం జరగకు ండా వాయిదా వేసి  ఉంటారని  పలువురు అభిప్రా యపడుతున్నారు. 

ఏదిఏమైనా సమన్వయంతో వ్యవహరించాల్సిన ధర్మకర్తల మండలి చైర్మన్‌, ఈవోలు ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరించటం విమ ర్శలకు తావిస్తుంది. కనీసం ఈసారి జరిగే సమావేశం నాటికైనా అన్ని సర్దుకుపోయి అభివృద్ధిపై దృష్టి పెడతారా లేక ఇదే పంధాలో కొన సాగుతూ ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తారో  వేచి చూడాలి. 

Updated Date - 2022-08-08T05:11:29+05:30 IST