నూతన విద్యావిధానాన్ని అమలు చేయండి

ABN , First Publish Date - 2022-05-31T13:34:34+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన విద్యావిధానాన్ని అన్ని విశ్వవిద్యాలయాలు అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పిలుపునిచ్చారు. నగరంలో సోమవారం జరిగిన

నూతన విద్యావిధానాన్ని అమలు చేయండి

                          - గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి  


చెన్నై: కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నూతన విద్యావిధానాన్ని అన్ని విశ్వవిద్యాలయాలు అమలు చేయాలని రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పిలుపునిచ్చారు. నగరంలో సోమవారం జరిగిన రాష్ట్ర సార్వత్రిక విశ్వవిద్యాలయం 13వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్‌ వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ ప్రసంగిస్తూ.. కొద్ది రోజుల క్రితం జరిగిన విశ్వవిద్యాలయాల వైస్‌ఛాన్సలర్ల సదస్సులో వారి విద్యాభివృద్ధికి సంబంధించి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నానని, ప్రస్తుతం రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విద్యావిధానాలను పునఃసమీక్ష చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకూ దేశాభివృద్ధిపై పెట్టిన విధానంలో అప్పటికీ, ఇప్పటికీ తేడాలున్నాయని, అందుకే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానంతో విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆయా రాష్ట్రాలకు అనుగుణంగా అమలవుతున్న విద్యావిధానంలో మార్పులు అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో నూతన విద్యా విధానం అమలు చేయడానికి అన్ని రాష్ట్రాలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. నూతన విద్యావిధానంలో చదువులు అర్థాంతంగా మానివేసినవారు కూడా మళ్ళీ విద్య కొనసాగించేందుకు వీలుందని గవర్నర్‌ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Updated Date - 2022-05-31T13:34:34+05:30 IST