Governor: నేను కూడా తమిళంలో మాట్లాడతా...

ABN , First Publish Date - 2022-08-04T14:17:23+05:30 IST

త్వరలో తాను తమిళంలో సరళంగా మాట్లాడుతానని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) తెలిపారు. ఈరోడ్‌ జిల్లా ఓడానిల్‌లో బుధవారం జరిగిన

Governor: నేను కూడా తమిళంలో మాట్లాడతా...

                                    - గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 3: త్వరలో తాను తమిళంలో సరళంగా మాట్లాడుతానని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi) తెలిపారు. ఈరోడ్‌ జిల్లా ఓడానిల్‌లో బుధవారం జరిగిన స్వాతంత్య్ర సమరయోధుడు ధీరన్‌ చిన్నమలై వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌ మాట్లాడుతూ... దేశ స్వాతంత్య్ర కోసం ధీరన్‌ చిన్నమలై ప్రాణత్యాగం చేశారని, దేశ స్వాతంత్య్రం కోసం రక్తం చిందించిన సమరయోధులను మరువరాదన్నారు. ధీరన్‌ చిన్నమలైకు అంజలి ఘటించేలా మెరుగైన భారత్‌ నిర్మాణంలో పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు. తమిళం ప్రాచీన, అత్యంత అందమైన భాష అని, రాష్ట్రంలో ప్రజలతో సామానంగా తాను కూడా సరళంగా తమిళం మాట్లాడాలని ఇష్టంగా ఉందని, త్వరలో మీలాగే తమిళంలో మాట్లాడతానని గవర్నర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai), పేరూరు ఆధీనం శాంతలింగమరుదాచల్‌ అడిగళార్‌, శిరవై ఆధీనం రామానంద కుమరగురుపర స్వామిగళ్‌, పళని సాధు స్వామిగళ్‌, తిరుమడ మఠాధిపతి షణ్ముగ అడిగళార్‌ తదితరులు కూడా పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T14:17:23+05:30 IST