Advertisement
Advertisement
Abn logo
Advertisement
Dec 4 2021 @ 10:21AM

అధిక వడ్డీ పేరిట రూ.50 కోట్ల మోసం

                    - ప్రభుత్వ టీచర్‌ అరెస్టు


వేలూరు(చెన్నై): స్థానిక కొన వట్టమ్‌కు చెందిన మహేశ్వరి (55) అదే ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో గణితం టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమె భర్త ధర్మలింగం (60) రిటైర్డ్‌ ఎస్‌ఐ. వీరిద్దరు కలసి 2018లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ప్రారంభించి, తమ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని ప్రకటన చేశారు. దానిని నమ్మి రాణిపేటకు చెందిన టీచర్‌ ఝాన్సీరాణి రూ.2.50 కోట్లు, మరో టీచర్‌ రూ.2.50 కోట్లు పలువురు ఉపాధ్యాయులు, ప్రజలు పెట్టుబడులు పెట్టారు. చాలా కాలం అయునా వడ్డీ రాకపోవడంతో బాధితులు వారిని అడుగగా, హత్య చేస్తామని బెదిరించినట్లు సమాచారం. దీంతో, బాధితులు జిల్లా క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై పోలీసులు జరిపిన విచారణలో, మహేశ్వరి, ధర్మలింగం దంపతులు సుమారు రూ.50 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు, ఈ డబ్బుతో కుమార్తెల పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు తేలడంతో వారిపై కేసు నమోదుచేసి, మహేశ్వరిని గురువారం ఉదయం అరెస్టు చేసి పరారీలో ఉన్న ఆమె భర్త కోసం గాలిస్తున్నారు.

Advertisement
Advertisement