ప్రభుత్వ తీరు దారుణం: చినరాజప్ప

ABN , First Publish Date - 2020-11-01T07:11:37+05:30 IST

రాష్ట్ర రాజధానికి వేలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్నా, మహిళలు పోరాటాలు చేస్తున్నా ఏమీ పట్టనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు.

ప్రభుత్వ తీరు దారుణం: చినరాజప్ప
గృహ నిర్బంధంలో చినరాజప్ప

  • గృహ నిర్బంధంలో మాజీ హోంమంత్రి

సామర్లకోట, అక్టోబరు 31: రాష్ట్ర రాజధానికి వేలాది మంది రైతులు ఆందోళనలు చేస్తున్నా, మహిళలు పోరాటాలు చేస్తున్నా ఏమీ పట్టనట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు దారుణమని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు. అమరావతి రాజధాని ఉద్యమంలో భాగంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చేస్తున్న రైతుల చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించిన నేపథ్యంలో అన్నదాతకు బేడీలు వేయడాన్ని నిరసిస్తూ గుంటూరు జైల్‌భరో కార్యక్రమానికి రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. ఈ సందర్భంగా అమరావతి రైతులకు సంఘీభావం తెలిపేందుకు బయలుదేరుతున్న ఎమ్మెల్యే చినరాజప్పను శనివారం అచ్చంపేటలోని ఆయన స్వగృహంలోనే పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ నాయకుల అరెస్టులతో అమరావతి ఉద్యమాన్ని ఆపలేరన్నారు. వైసీపీ ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పార్టీ నాయకుల గృహనిర్బంధనాలను ఆయన ఖండించారు. ఈ ప్రభుత్వా నికి తగిన గుణ పాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఎమ్మెల్యే చినరాజప్ప ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  

Updated Date - 2020-11-01T07:11:37+05:30 IST