కావ్యశ్రీ కుటుంబానికి ప్రభుత్వ సాయం

ABN , First Publish Date - 2022-07-01T04:39:17+05:30 IST

మండలంలోని తాటిపర్తి గ్రామానికి చెందిన కావ్యశ్రీ కుటుంబానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5లక్షల ఆర్థిక సహాయం చేసింది.

కావ్యశ్రీ కుటుంబానికి ప్రభుత్వ సాయం
కావ్య తల్లిదండ్రులకు చెక్కును అందజేస్తున్న మంత్రి కాకాణి

 రూ.5లక్షల చెక్కు అందించిన కాకాణి

పొదలకూరురూరల్‌, జూన్‌ 30 : మండలంలోని తాటిపర్తి గ్రామానికి చెందిన కావ్యశ్రీ కుటుంబానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.5లక్షల ఆర్థిక సహాయం చేసింది. తనను ప్రేమించలేదనే అక్కసుతో అదే గ్రామానికి చెందిన సురేష్‌ కావ్యశ్రీని తుపాకీతో కాల్చి చంపి, అదే తుపాకీతో తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి గురువారం  నెల్లూరులో కావ్యశ్రీ తల్లిదండ్రులకు చెక్కును అందజేశారు. వారు ప్రభుత్వానికి, మంత్రి కాకాణికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-07-01T04:39:17+05:30 IST