కదంతొక్కిన ‘టీచర్లు’

ABN , First Publish Date - 2022-01-19T06:38:30+05:30 IST

భానుగుడి (కాకినాడ), జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వంపై ఉపాధ్యాయ లోకం విరుచుకుపడింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం ఆందోళనలతో హోరెత్తించింది. అసంబద్ధ పీఆర్సీ ఉత్తర్వులను, సీపీఎస్‌ విధానా న్ని రద్దు చేయకపోవడాన్ని తీవ్ర స్థాయిలో నిరసించింది. పీఆర్సీ జీవోల ప్రతులను ఎక్కడికక్కడ దహనం చేసింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్స్‌ (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో ఈ ఆందోళనా కార్యక్రమాలు జరిగాయి. అమలాపురంలో జరిగిన నిరసనలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) పాల్గొనగా, మిగిలినచోట్ల పలు ఉపాధ్యాయ

కదంతొక్కిన ‘టీచర్లు’
కాకినాడలో పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు

రాష్ట్ర ప్రభుత్వంపై ఫ్యాప్టో ఆగ్రహం 

జగన్‌ నట్టేట ముంచారంటూ ఆందోళన

జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు 

ఎక్కడికక్కడ పీఆర్సీ జీవో ప్రతుల దహనం 

రేపు కలెక్టరేట్‌ ముట్టడికి పిలుపు   

‘చలో విజయవాడ’ తర్వాత ఉద్యమ బాట

భానుగుడి (కాకినాడ), జనవరి 18: రాష్ట్ర ప్రభుత్వంపై ఉపాధ్యాయ లోకం విరుచుకుపడింది. జిల్లావ్యాప్తంగా మంగళవారం ఆందోళనలతో హోరెత్తించింది. అసంబద్ధ పీఆర్సీ ఉత్తర్వులను, సీపీఎస్‌ విధానా న్ని రద్దు చేయకపోవడాన్ని తీవ్ర స్థాయిలో నిరసించింది. పీఆర్సీ జీవోల ప్రతులను ఎక్కడికక్కడ దహనం చేసింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఆర్గనైజేషన్స్‌ (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో ఈ ఆందోళనా కార్యక్రమాలు జరిగాయి. అమలాపురంలో జరిగిన నిరసనలో ఉభయగోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ యిళ్ల వెంకటేశ్వరరావు (ఐవీ) పాల్గొనగా, మిగిలినచోట్ల పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు నాయకత్వం వహించారు. జిల్లా స్థాయిలో కాకినాడలో జరిగిన కార్యక్రమంలో పెద్దఎత్తున ఉపాధ్యాయులు హాజరయ్యారు. జడ్పీ భవనం నుంచి 500 మంది ఉపాధ్యాయులు ధర్నాచౌక్‌ వరకు ర్యాలీగా వెళ్లి పీఆర్సీ జీవో ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ సీహెచ్‌ రవి, బహుజన టీచర్స్‌ అసోసియేషన్‌ చైర్మన్‌ శరత్‌, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పి.చక్రవర్తి, సీపీఎస్‌ రాష్ట్ర కార్యదర్శి మొండి రవికు మార్‌లు మాట్లాడుతూ రావాలి కావాలి జగన్‌ అనుకుని గద్దెనెక్కిస్తే, ప్రభుత్వం ఇప్పుడు అర్ధరాత్రి విడు దల చేసిన జీవోలతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను నట్టేట ముంచేందుకు సిద్ధమైందని దుయ్యబట్టారు. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ 27 శాతం గతంలో ఎక్కువగా ఉండేదని దీనికన్నా తక్కువ ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఉద్యోగు లను మనోవేదనకు గురిచేశారన్నారు. గతంలో హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లు ఉన్నప్పుడు పట్టణ ప్రాంతాల్లో నివసిం చేందుకు అవకాశం ఉండేదని, 8 శాతం హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌లు విధించడం వల్ల ఉద్యోగుల వేతనాల్లో కోత కోయడమేనని విమర్శించారు. గతంలో పీఆర్సీ ఐదేళ్లకొకసారి ఇచ్చేవారని, ఇప్పుడు పదేళ్లకు ఇవ్వడం వల్ల బతకలేక బడిపంతులు అనే నానుడి మళ్లీ వస్తోందన్నారు. ఉద్యోగులకు భద్రత లేకుండా చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరు సరికాదని, అర్ధరాత్రి విడుదల చేసిన జీవోలు రివర్స్‌ పీఆర్సీగా ఉందని విమర్శించారు. అధి కారంలో రాగానే ఇళ్లు కట్టిస్తానన్న ప్రభుత్వం అద్దె ఇంట్లో ఉంటున్న ఉద్యోగులకు ప్రభుత్వమే అద్దె కట్టేట్టు ప్రయత్నాలు చేయాలన్నారు. గద్దెఎక్కే వరకు ఒకలా, ఎక్కిన తరువాత మరోలా వ్యవహరిస్తున్న జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో పోరాటం సాగిస్తామన్నారు. ఈనెల 20వ తేదీన జరిగే కలెక్టరేట్‌ ముట్టడి కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు భారీగా పాల్గొని విజయ వంతం చేయాలని, 28న ఛలో విజయవాడ నిర్వహించనున్నామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే రానున్న రోజుల్లో ఉద్యమబాట తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్ర మంలో కాకినాడ అర్బన్‌, రూరల్‌ ప్రాంతాలకు చెందిన ఉపాఽధ్యాయులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T06:38:30+05:30 IST