ప్రభుత్వ జాగా.. వేసెయ్‌ పాగా!

ABN , First Publish Date - 2021-09-05T05:11:37+05:30 IST

నరసరావుపేట పట్టణంలో యథే చ్ఛగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి చెం దిన నేత ఒకరు సత్తెనపల్లి రోడ్డులో ప్రధాన వరద నీటి కాలువను పూ డ్చి రోడ్డు నిర్మించుకున్నారు.

ప్రభుత్వ జాగా..   వేసెయ్‌ పాగా!
సత్తెనపల్లి రోడ్డులో ప్రధాన వరద నీటి కాలువను పూడ్చి అక్రమించిన చిత్రం

నరసరావుపేటలో ప్రభుత్వ స్థలాలు కబ్జా

చివరకు వరద నీటి కాలువలను వదలడం లేదు

అధికారం మాదే.. అడిగేదెవరు అన్న రీతిలో నేతలు

చోద్యం చూస్తున్న అధికారులు

 

నరసరావుపేటలో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు పంట, వరదనీటి, మురుగు కాలువలను, వాగులను వదలడంలేదు. ప్రభుత్వ జాగా కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. అధికారం మాదే .. మేం ఏమి చేసినా.. అడిగేదెవరు అన్న రీతిలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యవహరిస్తున్నారు. నేతల వత్తిడికి తలొగ్గి కొంతమంది అధికారులు కబ్జాలను అడ్డుకోకుండా చోద్యం చూస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 


 

నరసరావుపేట, సెప్టెంబరు 4: నరసరావుపేట పట్టణంలో యథే చ్ఛగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. అధికార పార్టీకి చెం దిన నేత ఒకరు  సత్తెనపల్లి రోడ్డులో ప్రధాన వరద నీటి కాలువను పూ డ్చి రోడ్డు నిర్మించుకున్నారు. కాలువకు సంబంధించిన తూము లు కూడా పూడ్చివేశారు. దీంతో ఆగక కత్తవ చెరువు స్థలా న్ని కూడా కబ్జా చేస్తున్నారు. చెరువు స్థలంలో నిర్మాణం కూడా చేపట్టా రు. మునిసిపల్‌ మాస్టర్‌ప్లాన్‌, మైనర్‌ ఇరిగేషన్‌ శాఖ రికార్డుల ప్రకారం వరద నీటి కాలువ 60 అడుగులు ఉంది. ఈ కాలువ ఆ క్రమణకు గురైంది. కత్తవ చెరువు మొత్తం 47 ఎకరాలు ఉందని అధికారులు తెలిపారు. మూడేళ్ల క్రితం జరిపిన సర్వే ప్రకారం అప్పట్లో సూ మారు 13 ఎకరాలు ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. ఈ చెరువు స్థలాన్ని ప్రస్తుతం ఆక్రమిస్తున్నారు. అధికార పార్టీ అండదండల తోనే ఆక్రమణ జరుగుతున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధి కార పార్టీకి చెందిన నేత ఒకరు చెరువు స్థలం దాదాపు 10 సెంట్లు ఆక్రమించి నిర్మాణం చేపట్టినట్టు అధికారులకు ఫిర్యాదులు అందా యి. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కబ్జా చేసిన నేత ఆ స్థలం తనదేనని అధికారులకు చెబుతున్నట్టు సమాచారం. 60 అడు గుల వరదనీటి కాలువ  స్థలం ఉండాలి. ప్రస్తుతం ఎంత ఉందో అధి కారులు కొలతలు వేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. పట్టణం లోని సగం ప్రాంతానికి చెందిన మురుగు, వరద నీరు ఈ కాలువ లోంచే  చెరువులోకి ప్రవహించాలి. ఈ కాలువను కబ్జా చేయడంతో వరద నీరు వెనక్కు వెళ్లి సమీప ప్రాంతం ముంపునకు గురవుతోంది. గతంలో ఈ కాలువ పొంగి చాలా ప్రాంతాలు ముంపునకు గురైన విషయం తెలిసిందే. స్థలం కొనుగోలు చేశానని చెబుతున్న వ్యక్తి వరద కాలువలు కొనుగోలు చేయకూడదన్న విషయం తెలుసుకోక పోవడం గమనార్హం. చట్టం తెలుసుకొని క్రయ విక్రయాలు జరపాల్సి ఉండగా పరిధి దాటి వ్యవహరించడం అధికార పార్టీ అండదండ లు ఉండటమేనన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత విలువైన చెరువు స్థలాన్ని కాపాడటంతో పాటు,  వరద నీటి కాలువలను పునరుద్ధరించేందుకు అధికారులు స్పందిస్తారా? అధికార పార్టీ నేతల వత్తిడిలకు తలొగ్గుతారో చూడాలి. వరద నీటి కాలువను పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తామని, ఆక్రమించిన వారిపై చర్య లు తీసుకుంటామని కమిషనర్‌ కె.రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రణా ళిక విభాగం సిబ్బందిని స్థలాన్ని పరిశీలించి చర్యలు తీసుకో వాలని అదేశించానన్నారు. మైనర్‌ ఇరిగేషన్‌ అధికారి బాల కృష్ణను వివరణ కోరగా చెరువు స్థలాన్ని పరిశీలించి ఆక్రమణలు తొలగిస్తా మన్నారు. గతంలో స్థిరాస్తి వ్యాపారులు అల్లూరివారి పాలెం ప్రాంతంలో వాగు స్థలాన్ని, పాలపాడు రోడ్డు, ఇస్సపాలెం అగ్రహారం రోడ్డులో సాగు నీటి కాలువలను ఆక్రమించారు వీటిపై నేటికీ ఎటువంటి చర్యలు లేవు. మునిసిపల్‌ కార్యాలయం సమీ పంలో ప్రభుత్వం స్థలం ఆక్రమించి బంకు ఏర్పాటు చేసిన విష యం తెలిసిందే. పట్టణానికి ముంపు ప్రమాదం ముంచుకొచ్చే వరద నీటి కాలువ విషయంలో నైనా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా యంత్రాంగం స్పందించాలి. 

 

Updated Date - 2021-09-05T05:11:37+05:30 IST