ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావు
ఏటికొప్పాక ఫ్యాక్టరీ ఎండీ వెంకటేశ్వరరావు
ఎస్.రాయవరం, జనవరి 27 : ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీలో ఈ ఏడాది చెరకు క్రషింగ్ లేనందున సుమారు 11 వేల టన్నుల చెరకును గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ డి.వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ ఇందుకు సం బంధించి రైతులకు టన్నుకు రూ.2470 మద్దతు ధర లభిస్తుందన్నారు. లేదా రైతులే నేరుగా గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి తరలించుకుంటే టన్నుకు రూ 3,100 వస్తుందని చెప్పారు.