న్యాయపోరాటం చేస్తా..: Gouthu Sireesha

ABN , First Publish Date - 2022-06-07T16:24:46+05:30 IST

తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులపై వైసీపీ (YCP) నేతల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి.

న్యాయపోరాటం చేస్తా..: Gouthu Sireesha

Amaravathi: ఏపీ (AP)లో తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులపై వైసీపీ (YCP) నేతల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని టీడీపీ నేతలపై తప్పుడు ప్రచారం చేసి ప్రజల్లో వ్యతిరేకభావన తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తప్పుడు పోస్టులు పెట్టారని కేసులు నమోదు చేసి విచారణ పేరుతో తమ వారిని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. ఫేక్ పోస్టు పెట్టారన్న కారణంతో సీఐడీ అధికారులు గౌతు శిరీష (Gouthu Sireesha)ను ఏడు గంటలపాటు విచారించారు. ‘‘సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు ఒప్పుకో.. సంతకం పెట్టకుంటే మర్యాద దక్కదు’’ ఇదీ ఏడుగంటలపాటు విచారణలో సీఐడీ అధికారులు టీడీపీ నేత గౌతు శిరీషను బెదించారు. కనీసం మహిళా అని చూడకుండా అధికారులు వ్యవహరించారని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. ఏడు గంటలపాటు విచారణ జరిపి కనీసం మంచినీళ్లు, ఆహారం కూడా ఇవ్వలేదని ఆమె అన్నారు. అధికారుల తీరుపై న్యాయపోరాటం చేస్తామన్నారు. తన లాయర్‌తోనూ మాట్లాడనివ్వలేదని తెలిపారు. విచారణలో అధికారులు వ్యవహరించిన తీరు ఇదేనా? అని శిరీష మండిపడ్డారు.


వైసీపీ నేతల ట్వీట్ వెనుక కుట్ర దాగి ఉందని కులాలు, పార్టీల మధ్య చిచ్చు పెట్టేందుకు వ్యవహరిస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు. వైసీపీ పార్టీ, పీకే టీమ్ తాడేపల్లి రాజప్రస్థానం నుంచి సజ్జల డైరెక్షన్‌లో ఈ ఫేక్ ట్వీట్లు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఫేక్ ట్వీట్లు పెట్టిన మంత్రి అంబటి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. తనపై పెట్టిన ఫేక్ ట్వీట్‌పై విచారణ జరపాలని సీఐడీ అధికారులను కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ట్వీట్ చేసినా వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో తమ నేతలపై వైసీపీ శ్రేణులు చేసే ట్వీట్లపై మాత్రం ఏమీ పట్టనట్లు వ్యహరిస్తున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు.

Updated Date - 2022-06-07T16:24:46+05:30 IST