Pakistan ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య రెహమ్‌ఖాన్ కారుపై ఆగంతకుల కాల్పులు

ABN , First Publish Date - 2022-01-03T15:36:57+05:30 IST

పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య రెహమ్‌ఖాన్ కారుపై ఆగంతకులు కాల్పులు జరిపారు...

Pakistan ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య రెహమ్‌ఖాన్ కారుపై ఆగంతకుల కాల్పులు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ మాజీ భార్య రెహమ్‌ఖాన్ కారుపై ఆగంతకులు కాల్పులు జరిపారు. ఆదివారం రాత్రి తాను ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాజీ భార్య రెహమ్ ఖాన్ ఆరోపించారు.ఇమ్రాన్ ఖాన్ పాలనలో పాకిస్థాన్ పిరికిపందలు, దుండగులు,అత్యాశపరుల దేశంగా మారిందని ఆమె పేర్కొన్నారు.తన మాజీ భర్తను లక్ష్యంగా చేసుకొని రెహమ్ ఖాన్ విమర్శలు గుప్పించారు.‘‘నా మేనల్లుడి వివాహం నుంచి తిరిగి వస్తుండగా నా కారుపై కాల్పులు జరిగాయి. మోటర్‌బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపారు.కాల్పులు జరిపినపుడు కారులో నా వ్యక్తిగత కార్యదర్శి, డ్రైవర్ ఉన్నారు.’’ అని రెహమ్ ఖాన్ ట్వీట్ చేశారు. 


కాల్పుల ఘటన తనకు ఆందోళన కలిగించిందని ఆమె చెప్పారు.బ్రిటీష్-పాకిస్థానీ మూలాలకు చెందిన జర్నలిస్ట్, మాజీ టీవీ యాంకర్ అయిన రెహమ్ ఖాన్ ఇమ్రాన్ ఖాన్‌ను 2014లో వివాహం ఆడారు. అప్పటి నుంచి 2015అక్టోబర్ 30వ తేదీ వరకు కాపురం చేసి ఇమ్రాన్ నుంచి విడిపోయారు. 48 ఏళ్ల రెహమ్ ఖాన్ తన మాజీ భర్తపై విమర్శకురాలిగా ప్రసిద్ది చెందారు. తరచూ ఇమ్రాన్ ఖాన్ ను ఆమె దూషిస్తుంటారు. 2019లో పుల్వామా దాడి తర్వాత ఇమ్రాన్ ఖాన్ దేశ సైన్యం చేతిలో కీలుబొమ్మ అని, భావజాలం,మితవాద విధానంపై రాజీపడి ఆయన అధికారంలోకి వచ్చారని రెహమ్ ఖాన్ ఆరోపించారు.


Updated Date - 2022-01-03T15:36:57+05:30 IST