Abn logo
Apr 10 2020 @ 16:55PM

విక్రమ్ వీడ్కోలు నిజం కాదట!

అద్భుత నటనతో, వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు హీరో విక్రమ్. తమిళంతోపాటు తెలుగులోనూ విక్రమ్‌కు అభిమానులున్నారు. కొంతకాలంగా ఆయన నటించిన సినిమాలేవీ అభిమానులను ఆకట్టుకోలేదు. మరోవైపు ఆయన తనయుడు ధ్రువ్ హీరోగా తెరంగేట్రం చేస్తున్నాడు. 


ఈ నేపథ్యంలో నటన నుంచి విక్రమ్ పూర్తిగా బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నారని, కొడుకు కెరీర్‌పైనే దృష్టి సారించాలనుకుంటున్నారని తమిళ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా విక్రమ్ పీఆర్వో స్పందించారు. విక్రమ్‌కు అలాంటి ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ` సినిమాల నుంచి విక్రమ్ తప్పుకుంటున్నారనే వార్తల్లో నిజం లేదు. ఆయన ప్రస్తుతం `కోబ్రా` సినిమాలో నటిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రానికి కూడా ఓకే చెప్పారు. మరిన్ని ఆసక్తికర చిత్రాలకు సంబంధించిన విశేషాలను త్వరలోనే వెల్లడిస్తార`ని ఆయన తెలిపారు.  

Advertisement
Advertisement
Advertisement