గొర్రెలు, మేకలకు ఉచిత టీకాలు

ABN , First Publish Date - 2022-08-09T03:01:58+05:30 IST

వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లోని గొర్రెలు, మేకల్లో వచ్చే నీలినాలుక, మూతి పండ్లు వ్యాధులకు ఉచితంగా టీకాలు వే

గొర్రెలు, మేకలకు ఉచిత టీకాలు

వలేటివారిపాలెం, ఆగస్టు 8 : వలేటివారిపాలెం, లింగసముద్రం మండలాల్లోని గొర్రెలు, మేకల్లో వచ్చే నీలినాలుక, మూతి పండ్లు వ్యాధులకు ఉచితంగా టీకాలు వేయనున్నట్లు పశుసంవర్దకశాఖ సహాయకులు కేవీ  బ్రహ్మయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ వ్యాధుల వల్ల గొర్రెలకు ఎక్కువగా జ్వరం, నోటిలో పుండ్లు ఏర్పడతాయన్నారు. ఈ వ్యాధి సోకిన గొర్రెల్లో నాలుక నీలిరంగుగా మారుతుందన్నారు. ఈ వ్యాధి సోకిన జీవాలకు రాగిజావలో అరటిపండును కలిపి పెట్టాలన్నారు.  ఈ వ్యాధి రాకముందే ముందస్తుగా టీకాలు వేయించాలని  ఆయన తెలిపారు.

Updated Date - 2022-08-09T03:01:58+05:30 IST