Gorantla Madhav: ఆ వీడియో ఒరిజనల్ కాదన్న ఎస్పీ

ABN , First Publish Date - 2022-08-10T21:56:42+05:30 IST

గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) నగ్న వీడియో కాల్‌ వ్యవహారంలో

Gorantla Madhav: ఆ వీడియో ఒరిజనల్ కాదన్న ఎస్పీ

అనంతపురం: గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో కలకలం రేపుతున్న ఎంపీ గోరంట్ల మాధవ్ (Gorantla Madhav) నగ్న వీడియో కాల్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వీడియోను ఒరిజనల్ అని నిర్థారించలేకపోతున్నామని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. వీడియోను మార్ఫింగ్‌ (Morphing) లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వీడియోకు సంబంధించి బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదని, వీడియోని మార్ఫింగ్‌ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని ఎస్పీ మీడియాకు వెల్లడించారు. వీడియోను మొదట iTDP official అనే వాట్సాప్ గ్రూపులో పోస్ట్‌ చేశారని తెలిపారు. ఈ నెల 4 అర్ధరాత్రి 2.07 గంటలకు +447443703968 నెంబర్‌ నుంచి పోస్ట్‌ చేసినట్లు చెప్పారు. సదరు నెంబరు యూకే వొడాఫోన్‌కు సంబంధించినదిగా గుర్తించామని ప్రకటించారు. సదరు వీడియోను వేరే మొబైల్‌ ద్వారా చిత్రీకరించారని, ఒరిజనల్ వీడియో దొరికే దాకా ఏమీ చెప్పలేమని ఎస్పీ తెలిపారు.



ఓ వ్యక్తి పంపిన వీడియోను షూట్‌ చేసి మరో వ్యక్తి పోస్ట్ చేశారని, ఒరిజనల్ వీడియో ఉంటేనే ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపగలమని స్పష్టం చేశారు. ఎంపీ మాధవ్ ఇంతవరకు తమకు ఫిర్యాదు చేయలేదన్న ఎస్పీ, వీడియో లింక్‌పై పూర్తిస్థాయిలో విచారణ జరిపామని ఫకీరప్ప చెప్పారు. మరోవైపు ఎంపీ గోరంట్ల మాధవ్ అభిమాని చేసిన ఫిర్యాదుపైనే పోలీసుల విచారణ కొనసాగుతోంది. గోరంట్ల మాధవ్‌కు సంబంధించిన లెటర్ ప్యాడ్ నుంచి కానీ.. అతని వ్యక్తిగత సహాయకుడు నుంచి గానీ పోలీసులకు ఫిర్యాదు అందలేదు. అభిమానిగా చెప్పుకుంటున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు మాత్రమే పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. 

Updated Date - 2022-08-10T21:56:42+05:30 IST