Gorantla dirty video: గోరంట్ల డర్టీ వీడియోపై రోజా సింపుల్ రియాక్షన్‌.. ఏపీ ప్రజల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-08-08T18:06:09+05:30 IST

అసలు ఆ వీడియో నిజమైందో కాదో.. తెలుసుకోకుండా ఈ రాద్దాంతం ఏమిటంటూ మంత్రి రోజా వ్యాఖ్యలపై...

Gorantla dirty video: గోరంట్ల డర్టీ వీడియోపై రోజా సింపుల్ రియాక్షన్‌.. ఏపీ ప్రజల ఆగ్రహం

అమరావతి (Amaravathi): వైసీపీ ఎంపీ గోరంట్ల డర్టీ వీడియో (Gorantla dirty video)పై దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఓ వైపు ఏపీ మహిళ కమిషన్ ఛైర్మన్ కూడా స్పందిస్తూ విచారణకు ఆదేశించారు. మరోవైపు మహిళాలోకం మొత్తం గోరంట్ల మాధవ్ వీడియోపై భగ్గుమంటున్నారు. నేషనల్ మీడియా (National Media) సయితం ఎంపీ గోరంట్ల రాసలీలలపై ప్రత్యేక కవరేజ్ ఇచ్చింది. ఏపీ పరువును వైసీపీ నేతలు (YCP Leaders) మంటకలిపారంటూ ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతున్నాయి. ఇంత జరుగుతుంటే ఏపీ మంత్రి రోజా (Roja)కు మాత్రం ఈ విషయం చాలా చిన్నదిగా కనిపిస్తోంది. గోరంట్ల బాగోతం బయటకు వచ్చిన మూడు రోజులకు మాట్లాడిన రోజా.. ‘అసలు ఆ వీడియో నిజమైందో కాదో.. తెలుసుకోకుండా ఈ రాద్దాంతం ఏంటి’ అంటూ సింపుల్‌గా తేల్చేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఒకప్పుడు అసెంబ్లీలో సీఎం జగన్‌ (CM Jagan)ను స్తుతించిన రోజా.. అందులో భాగంగా ఆడపిల్లలకు అన్యాయం జరిగితే గన్ కన్నా ముందు జగన్ వస్తాడంటూ మంచి పవర్ ఫుల్ డైలాగులు కొట్టారు. ఇప్పుడు ఎంపీ గోరంట్ల మాధవ్ అంశం బయటకు రాగానే నెటిజన్లు మంత్రి రోజాపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఊ అన్నా.. ఆ అన్నా టీడీపీ నేతలపై విరుచుకుపడిపోయే రోజా.. ఇప్పుడు ఎందుకు సైలంట్ అయ్యారంటూ సెటైర్లు వేశారు.. గన్ కన్నా ముందు వచ్చే జగన్ ఎక్కడ రోజమ్మా అంటూ ట్రోల్స్ చేశారు.’


ఎట్టకేలకు నోరు విప్పిన రోజా.. ఎంపీకి సంబంధించి వైరల్ అయిన ఆ వీడియో నిజమోకాదో తెలియదని, చాలా సింపుల్‌గా తేల్చేశారు. ఆ వీడియోపై నివేదిక వచ్చాకే సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారన్నారు. అంతేకాదు ఎప్పటిలాగే టీడీపీ నేతలపై ఎదురుదాడికి దిగారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలపై ఎన్నో అకృత్యాలు జరిగాయని అయినా ఎవరూ పట్టించుకోలేదని రోజా అడ్డగోలుగా మాట్లాడారు. అంతేకాదు గోరంట్ల రాజీనామా చేయాల్సి వస్తే.. చంద్రబాబు (Chandrababu), లోకేష్ (Lokesh) వందసార్లు రాజీనామా చేయాలంటూ రోజా పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. ఎంపీ గోరంట్ల నగ్న వీడియో బయటకు వచ్చాక కూడా మౌనంగా ఉండడమే కాకుండా టీడీపీ నేతలపై రోజా అడ్డగోలుగా నోరు పారేసుకోవడంతో ఏపీ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ఓ మహిళ మంత్రి అయ్యిండి.. ఓ మహిళపై జరిగిన లైంగిక వేధింపులపై ఇలాగేనా స్పందించేది.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-08-08T18:06:09+05:30 IST