Gorantla dirty videoకు.. కమ్మ సామాజిక వర్గానికి ఏం సంబంధం?

ABN , First Publish Date - 2022-08-08T19:44:26+05:30 IST

ఎంపీ గోరంట్ల మాధవ్ కమ్మ సామాజిక వర్గాన్ని దూషించడంపై కమ్మ సంఘం నేతలు మండిపడ్డారు.

Gorantla dirty videoకు.. కమ్మ సామాజిక వర్గానికి ఏం సంబంధం?

శ్రీ సత్యసాయి (Sri Sathyasai) జిల్లా: హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ (MP Gorantla Madhav)... కమ్మ సామాజిక వర్గాన్ని దూషించడంపై బత్తలపల్లి మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలిలో కమ్మ సంఘం (Kamma Sangam) నేతలు నిరసన తెలిపారు. ఎంపీ గోరంట్లకు చెందిన  ఒక  న్యూడ్ వీడియో (Nude Video)కు కమ్మ సామాజిక వర్గానికి ఏం సంబంధం అంటూ మండిపడ్డారు. గోరంట్ల కమ్మ సామాజిక వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడడం తగదన్నారు. వెంటనే ఎంపీ తన పదవికి రాజీనామా చేసి.. కమ్మ సామాజిక వర్గానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో కురవ కులానికి చెందిన వారంతా కమ్మ సామాజిక వర్గంతో అన్యోన్యంగా ఉంటామని, కేవలం గోరంట్ల మాధవ్ ఒక్కరు మాత్రమే కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం భావ్యం కాదన్నారు. ఈ సందర్భంగా బత్తలపల్లి మండల కేంద్రం నాలుగు రోడ్ల కూడలిలో కమ్మ సంఘం నేతలు గోరంట్ల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. 

Updated Date - 2022-08-08T19:44:26+05:30 IST