నేతి బీరలో నెయ్యెంతుంటుందో.. సీఎం మాటల్లో నీతి అంతే..: గోరంట్ల

ABN , First Publish Date - 2020-06-03T19:48:04+05:30 IST

అమరావతి: ఏపీలో దొంగలు పడ్డారని.. రాష్ట్రాన్ని దోచేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

నేతి బీరలో నెయ్యెంతుంటుందో.. సీఎం మాటల్లో నీతి అంతే..: గోరంట్ల

అమరావతి: ఏపీలో దొంగలు పడ్డారని.. రాష్ట్రాన్ని దోచేస్తున్నారని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇసుక మాఫియా చెలరేగుతోందని... అవసరాలకు ఇసుక దొరకడంలేదని.. బ్లాక్‌లో మాత్రమే దొరుకుతోందన్నారు. ఆన్‌లైన్ ఓపెన్ అయిన 5 నిమిషాల్లో క్లోజ్ అయ్యిందంటున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు. అవసరమైన వారికంటే బ్లాక్‌లో అమ్ముకునే వారికే ఇసుకు దొరకుతోందన్నారు. రేవుల నుంచి ఇసుకలో 50 శాతమే స్టాక్ పాయింట్లకు వెళ్తోందని... మిగిలింది బయటకు తరలించేస్తున్నారని బుచ్చయ్య చౌదరి విమర్శించారు.


సీఎం జగన్ నీతి వాఖ్యాలు చెబుతున్నారన్నారు. పది రోజుల్లో వరదలు వస్తే గోదావరిలో ఇసుక దొరకదన్నారు. మైనింగ్ మాఫియా రాష్ట్రాన్ని శాసిస్తోందని... భూముల సేకరణలో దోపిడీ చేస్తున్నారన్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. అవినీతి , అక్రమాలపై ముఖ్యమంత్రి చెప్పే మాటల్లో కూడా అంతే నీతి ఉంటుందని బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. పల్లపు భూముల్లో మెరకల పేరుతో దోపిడీ చేస్తున్నారని... గోదావరిలో నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో అడ్డంగా తవ్వేస్తున్నారన్నారు. వైసీపీలో అధిష్టానం నుంచి కింది స్థాయి వరకు రాష్ట్రాన్ని దోచేస్తున్నారని... అవినీతి పరాకాష్టకు చేరిందని బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

Updated Date - 2020-06-03T19:48:04+05:30 IST