Abn logo
May 29 2020 @ 14:05PM

హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప పెట్టు: బుచ్చయ్య చౌదరి

రాజమండ్రి: హైకోర్టు తీర్పు జగన్ ప్రభుత్వానికి చెంప పెట్టు వంటిదని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి పేర్కొన్నారు. ఇప్పటి వరకు 58 కోర్టు తీర్పులు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చాయన్నారు. ముఖ్యమంత్రిగా జగన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జగన్ నియంత పోకడల కారణంగా అధికారులు కోర్టు బోనుల్లో  నిలబడాల్సి  వస్తోందన్నారు. ఎనిమిదేళ్లుగా వాయిదా పడుతున్న జగన్ అక్రమ ఆస్తుల కేసు విచారణను వెంటనే పూర్తి చేయాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు.


Advertisement
Advertisement
Advertisement