సంపదను సృష్టించడం చేతకాక అప్పులబాట

ABN , First Publish Date - 2021-03-07T05:42:57+05:30 IST

సంపదను సృష్టించడం చేతగాకనే రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పులబాట పట్టారని టీడీపీ రాష్ట్ర కార్పొరేషన్‌ ఎన్నికల పర్యవేక్షకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు.

సంపదను సృష్టించడం చేతకాక అప్పులబాట
తెనాలి శ్రావణ్‌కుమార్‌తో సమావేశమైన ఎన్నికల పర్యవేక్షకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి

గోరంట్ల బుచ్చయ్య చౌదరి


గుంటూరు(తూర్పు), మార్చి6: సంపదను సృష్టించడం చేతగాకనే రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పులబాట పట్టారని టీడీపీ రాష్ట్ర కార్పొరేషన్‌ ఎన్నికల పర్యవేక్షకులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. ఆంద్రప్రదేశ్‌ను అప్పులప్రదేశ్‌గా మార్చిన ఘనత జగన్‌కే దక్కిందని ఎద్దేవా చేశారు. శనివారం అరండల్‌పేటలోని  పార్టీ జిల్లా కార్యాలయంలో నగర కార్పొరేషన్‌ ఎన్నికలపై అనుసరించాల్సిన విధానాలపై టీడీపీ నగర పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావుతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అన్ని కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం ఎంపీ గల్లా జయదేవ్‌, మేయర్‌ అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి నసీర్‌ అహ్మద్‌తో ఆయన సమావేశమయ్యారు. కార్యక్రమంలో కంచర్ల శివరామయ్య, నాయుడు ఓంకార్‌, అన్నమనేని మోహనరావు, అగస్టీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T05:42:57+05:30 IST