చెంగాళమ్మ ఆలయంలో గోపూజ చేస్తున్న ఈవో, పాలకవర్గ సభ్యులు
సూళ్లూరుపేట, జనవరి 16 : సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయంలో దేవదాయశాఖ ఆదేశానుసారం కనుమ పండగ సందర్భంగా ఆదివారం గోపూజ చేశారు. గోపూజతో కలిగే ఫలితాలను, గోఉత్పత్తుల గొప్పతనాన్ని, గో సంరక్షణ ఆవశ్యకతను వివరించారు. ఈవో ఆళ్ల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు గోగుల తిరుపాల్, కె. మదన్‌మోహన్, ముంగర అమరావతి, మద్దూరు శారద, మాదరపాక జగన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.