May 14 2021 @ 05:31AM

నిన్ను మించిన గిఫ్ట్‌ లేదు: గోపీచంద్‌

హీరో గోపీచంద్‌ సినిమాలకే కాకుండా కుటుంబానికి చక్కని ప్రాధాన్యత ఇస్తారు. 2013లో శ్రీకాంత్‌ మేనకోడలు రేష్మను వివాహం చేసుకున్నారు. గురువారంతో వారి వివాహ బంధానికి 8 వసంతాలు పూర్తయిన  సందర్భంగా భార్యతో దిగిన ఫొటో సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ఆమెకు విషెస్‌ తెలిపారు. ‘‘ప్రపంచంలో నిన్ను మించిన అద్భుతమైన గిఫ్ట్‌ లేదు. నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు’’ అని గోపీచంద్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన సంపత్‌ నంది దర్శకత్వంలో ‘సీటీమార్‌’, మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.