Abn logo
Jan 26 2021 @ 12:19PM

బాలయ్యతో గోపీచంద్?

ఈ ఏడాది సంక్రాంతికి `క్రాక్` సినిమాతో విజయం అందుకున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని. అతని తర్వాతి సినిమాలో నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించబోతున్నాడట. బాలయ్య కోసం గోపీచంద్ ఓ మాస్ కథను సిద్ధం చేశాడట. ఈ కథ నచ్చడంతో బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టు తెలుస్తోంది. 


మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోందట. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ కథలో బాలయ్య లుక్ కొత్తగా ఉంటుందట. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ సినిమాలోనే బాలయ్య నటించబోతున్నట్టు సమాచారం.

Advertisement
Advertisement
Advertisement