Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇస్రో శాస్త్రవేత్తగా మేళ్లచెర్వు మండల వాసి గోపి

మేళ్లచేర్వు, అక్టోబరు 14: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)లో ఎలక్ర్టికల్‌  ఇంజనీర్‌ శాస్త్రవేత్తగా సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మండలం రా మాపురానికి చెందిన గుమ్మడిదల గోపి గ్రూప్‌-1 గెజిటెడ్‌ ఉద్యోగం సాధిం చాడు. గ్రామానికి చెందిన గుమ్మడిదల వెంకటేశ్వర్లు వ్యవసాయం చేస్తూ ఇద్దరు కుమారులను ఉన్నత చదువులు చదివించారు. రామాపురం, మేళ్ల చెర్వులో ప్రాథమిక చదువులు పూర్తి చేసిన గోపి, బాసరలో సీటు సాధించి ట్రిపుల్‌ఐటీ పూర్తిచేశారు. గేట్‌ పరీక్ష ద్వారా ప్రభుత్వ సంస్థ అయిన బీఎస్‌ఎ న్‌ఎల్‌లో ఉద్యోగం సాధించారు. ఆయన ప్రసుత్తం ఒ డిశా టెలికాం సర్కిల్‌లో జూనియర్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వ హిస్తున్నారు. ఇస్రోలో ఉద్యోగం సాధించిన గోపిని తల్లిద ండ్రులతో పాటు గ్రామస్థులు అభినందించారు. వెంకటే శ్వర్లు పెద్ద కుమారుడు ఉపేందర్‌ 2020 బ్యాచ్‌లో ఆర్‌ఎస్‌ ఐగా ఉద్యోగం సాధించి ప్రసుత్తం రాచ కొండ కమిషనర్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. 

Advertisement
Advertisement