Abn logo
Sep 20 2021 @ 03:31AM

విజయానికి తొలిమెట్టు గోపవరం విజయం

మాట్లాడుతున్న లింగారెడ్డి, రెడ్యం, విజయమ్మ తదితరులు

టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి

బద్వేలు, సెప్టెంబరు 19: బద్వేలు ఉప ఎన్నికలో విజయానికి తొలిమెట్టు గోపవరం  జడ్పీటీసీ, ఎంపీటీసీల గెలుపు అని టీడీపీ కడప పార్లమెంటు అధ్యక్షుడు  లింగారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ జడ్పీటీసీ, ఎంపీపీలను మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, ఆమె కుమారుడు కె.రితే్‌షకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కైవశం చేసుకోవడం శుభపరణామమన్నారు. మున్సిపాలిటీ, పంచాయతీ ఎన్నికల్లో విజయమ్మ సత్తా చాట్టి అధిక సంఖ్యలో సర్పంచులు, కౌన్సిలర్లను గెలిపించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, బెదిరింపులు మరోవైపున పోలీసుల వేధింపులు వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ గోపవరంలో టీడీపీ విజయకేతనం ఎగురవేయడం చూస్తే బద్వేలులో టీడీపీ బలంగా ఉందనడానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర స్థాయిలో రికార్డు సృష్టించిన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ యువనేత కె.రితే్‌షకుమార్‌డ్డిని పార్టీ తరపున అభినందిస్తున్నామన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అడుగడుగునా దౌర్జన్యం, పోలీసులు బెదిరింపులకు గురి చేశారని అన్నారు. అందుకే ఈ ఎన్నికలను టీడీపీ బహిష్కరిస్తే.. అధిక స్థానాల్లో గెలిచామని వైసీసీ సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. బద్వేలు ఉప ఎన్నికల్లో తిరిగి టీడీపీ సత్తా చాటుతామని అందుకు గోపవరం విజయమే నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ మాట్లాడుతూ గోపవరం గెలుపు కార్యకర్తల కృషి ఫలితమన్నారు. ఇదే స్ఫూర్తితో సమష్టిగా కృషి చేసి జరగనున్న ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా డాక్టర్‌ రాజశేఖర్‌ను గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు.  డాక్టర్‌ రాజశేఖర్‌  మాట్లాడుతూ రాష్ట్రమంతా బద్వేలు వైపు, విజయమ్మ నాయకత్వం వైపు చూసేలా చేసిన గోపవరం ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కేసీ కెనాల్‌ వైస్‌చైర్మన రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. గోపవరం జడ్పీటీసీ ఎన్నికలో  విజయం సాధించిన  అభ్యర్థి జయరామిరెడ్డి, ఎంపీటీసీలను నాయకులు ఘనంగా సన్మానించారు.