Google security keys: 10 వేలమందికి ఉచితంగా...

ABN , First Publish Date - 2021-10-12T23:10:46+05:30 IST

వ్యక్తిగత సమాచారం హ్యాకింగ్ గురయ్యే అవకాశం అధికంగా ఉన్న రాజకీయ నాయకులు, మానవహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల

Google security keys: 10 వేలమందికి ఉచితంగా...

శాన్‌ఫ్రాన్సిస్కో: వ్యక్తిగత సమాచారం హ్యాకింగ్ గురయ్యే అవకాశం అధికంగా ఉన్న రాజకీయ నాయకులు, మానవహక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల వంటి వారికి సెక్యూరిటీ కీస్ ఇస్తామని గూగుల్ ప్రకటించింది. 14 వేలమందికిపైగా జీమెయిల్ యూజర్లు హ్యాకర్లకు లక్ష్యంగా మారినట్టు గూగుల్ గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే తొలి బ్యాచ్‌ కీస్‌ను పంపించినట్టు గూగుల్ థ్రెట్ అనలిస్ట్ గ్రూప్‌కు చెందిన షేన్ హంట్లీ తెలిపారు.


తాము హెచ్చరించామంటే చాలా వరకు బ్లాక్ చేసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని మర్చిపోవద్దని పేర్కొన్నారు. ఈ ఫిషింగ్ క్యాంపెయిన్‌ను రష్యా గ్రూపు ఏపీటీ20 (ఫ్యాన్సీ బేర్) నిర్వహిస్తోందని, రష్యా జీఆర్‌యూ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ నిర్వాహకులతో ఈ గ్రూపు రూపొందినట్టు పేర్కొన్నారు. ఈ ఫిషింగ్ గ్రూపు నుంచే పైన పేర్కొన్న 14 వేల మందికి హెచ్చరికలు వెళ్లాయి.


ఏపీపీ (అడ్వాన్స్‌డ్ ప్రొటెక్షన్ ప్రోగ్రాం)పై అవగాహన పెంచడంతోపాటు యూజర్లకు మరింత భద్రత కల్పించడంలో భాగంగానే ఈ పని చేపట్టినట్టు గూగుల్ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలతో భాగస్వామ్యం కుదుదర్చుకుని అత్యధిక ముప్పు ఉన్న యూజర్లు.. జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలు, ప్రభుత్వ అధికారుల వంటి వారికి ఈ ఏడాదిలో 10 వేలకుపైగా సెక్యూరిటీ కీలు అందిస్తామని వివరించింది.


ఏపీపీలో ఎన్‌రోల్ అయిన యూజర్లకు మాల్‌వేర్, క్రోమ్, ఆండ్రాయిడ్‌లలో హానికారక డౌన్‌లోడ్స్ నుంచి రక్షణ లభిస్తుందని తెలిపింది. అలాగే, వారి వ్యక్తిగత డేటా.. జీమెయిల్, డ్రైవర్, ఫొటోలు వంటివి అనధికారిక యాక్సెస్ కాకుండా రక్షణ లభిస్తుందని గూగుల్ వివరించింది. 

Updated Date - 2021-10-12T23:10:46+05:30 IST