Google: యూజర్ల కోసం మరో అద్భుతమైన అప్‌డేట్‌తో వచ్చేస్తున్న గూగుల్

ABN , First Publish Date - 2022-08-20T02:47:36+05:30 IST

శోధనలో యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు గూగుల్ (Google) సరికొత్త అప్‌డేట్‌పై పనిచేస్తోంది. ఇది సెర్చ్

Google: యూజర్ల కోసం మరో అద్భుతమైన అప్‌డేట్‌తో వచ్చేస్తున్న గూగుల్

న్యూఢిల్లీ: శోధనలో యూజర్లకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు గూగుల్ (Google) సరికొత్త అప్‌డేట్‌పై పనిచేస్తోంది. ఇది సెర్చ్ రిజల్ట్స్‌ను మరింత ప్రామాణికంగా, మరింత నాణ్యంగా అందించనుంది. వచ్చే మరికొన్ని వారాల్లోనే ఈ అప్‌డేట్స్‌ను తీసుకొస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది. కంటెంట్‌ను పాఠకులకు తెలియజేయడం కంటే క్లిక్స్ కోసం ఆకర్షించేలా డిజైన్ చేసినట్టు అనిపిస్తే వారు ఉపయోగకరంగా ఉండరన్న విషయం తమకు తెలుసని గూగుల్ పేర్కొంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంగ్లిష్ యూజర్ల కోసం వచ్చే వారం నుంచి కొత్త అప్‌డేట్స్ తీసుకొస్తున్నట్టు తెలిపింది.


వారికి అవసరమైన కంటెంట్‌ను కనుగొనడాన్ని ఈ అప్‌డేట్స్ మరింత సులభతరం చేస్తాయని పేర్కొంది. దీనిని ‘ఉపయోగకరమై కంటెంట్ అప్‌డేట్’(helpful content update)గా పేర్కొంది. పసలేని కంటెంట్‌ను ఇది గూగుల్ సెర్చ్‌లో హై ర్యాంక్ కలిగిన కంటెంట్‌గా చూపించదని, కంపెనీ అంతర్గత టెస్టింగ్‌లో సానుకూల ఫలితాలు వచ్చాయని తెలిపింది.  

Updated Date - 2022-08-20T02:47:36+05:30 IST