గూగుల్‌ స్పీచ్‌ అప్డేటెడ్‌!

ABN , First Publish Date - 2022-10-01T06:14:29+05:30 IST

గూగుల్‌ - టెక్స్ట్‌ టు స్పీచ్‌(టీటీఎస్‌), స్పీచ్‌ సర్వీసులను అప్డేట్‌ చేసింది.

గూగుల్‌ స్పీచ్‌ అప్డేటెడ్‌!

గూగుల్‌ - టెక్స్ట్‌ టు స్పీచ్‌(టీటీఎస్‌), స్పీచ్‌ సర్వీసులను అప్డేట్‌ చేసింది. మరింత స్పష్టతకు తోడు సహజమైన వాయిస్‌ ఈ అప్డేట్‌ ప్రత్యేకత. అప్‌గ్రేడ్‌ చేసి 67 భాషల్లో 421 వాయిస్‌లను విడుదల చేసింది. టీటీఎస్‌, స్పీచ్‌ సర్వీస్‌ యూజర్లకు ఇది ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్‌ అవుతుంది. 64- బిట్‌ ఆండ్రాయిడ్‌ డివైస్‌లన్నింటికీ రాబోయే వారాల్లో అందుతుంది. దీన్ని గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్డేట్‌ కానిపక్షంలో ఞ్చఛిజ్చుజ్ఛ ఛిౌఝ.జౌౌజజ్ఛూ.్చుఽఛీటౌజీఛీ.్ట్టట లో మినిమిమ్‌  వెర్షన్‌ కోడ్‌ 210390644లో చెక్‌ చేసుకోవచ్చు. డిఫాల్ట్‌గా వాయిస్‌ సపోర్ట్‌ ఉన్న యూజర్లకు ఇకపై వాయిస్‌లో చిన్నపాటి తేడా కనిపిస్తుంది. ఇది ఇతర లాంగ్వేజ్‌లకూ వర్తిస్తుంది. ఇంతకుమునుపు మాదిరిగా మూడు సెకెండ్లు మాత్రమే వాయిస్‌ ఉంటుంది. డిఫాల్ట్‌గా ఉన్న ఫిమేల్‌ వాయిస్‌లో మాత్రం మార్పు ఉంది. క్లియర్‌ టోన్‌తో కొద్దిగా రిలాక్స్‌డ్‌గా అనిపిస్తుంది. 

Updated Date - 2022-10-01T06:14:29+05:30 IST