75వ స్వాతంత్య్ర గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌

ABN , First Publish Date - 2022-08-16T07:11:26+05:30 IST

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్‌ తమ పేజీలో ప్రత్యేక డూడుల్‌ను ఏర్పాటు చేసింది.

75వ స్వాతంత్య్ర గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌

75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్‌ తమ పేజీలో ప్రత్యేక డూడుల్‌ను ఏర్పాటు చేసింది. చిన్నారులకు ఇష్టమైన పతంగుల క్రీడను ఈ డూడుల్‌లో చూపించింది. మువ్వన్నెలు కనిపించేలా దీన్ని రూపొందించింది. కేరళకు చెందిన నీతి అనే కళాకారిణి ఈ డూడుల్‌ను గీశారు. ఒక మహిళ గాలిపటాలను తయారుచేస్తుండగా.. యువత వాటిని ఎగురవేస్తున్నట్లుగా, వెనుక సూర్యోదయం, పచ్చటి పొలాలు కనిపించేలా దీన్ని చిత్రించారు. 

Updated Date - 2022-08-16T07:11:26+05:30 IST