గూగుల్‌లో గత నెలలో భారతీయులు వెతికింది వీటి కోసమే!

ABN , First Publish Date - 2020-07-03T02:34:40+05:30 IST

నిన్నమొన్నటి వరకు కరోనా వైరస్, దాని లక్షణాలు, విరుగుడు వంటి విషయాల కోసం గూగుల్‌లో తెగ వెతికిన

గూగుల్‌లో గత నెలలో భారతీయులు వెతికింది వీటి కోసమే!

న్యూఢిల్లీ: నిన్నమొన్నటి వరకు కరోనా వైరస్, దాని లక్షణాలు, విరుగుడు వంటి విషయాల కోసం గూగుల్‌లో తెగ వెతికిన భారతీయులు జూన్‌లో మాత్రం కరోనాను పక్కనపెట్టేశారు. గత నెలలో భారతీయులు ఎక్కువగా బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, సూర్యగ్రహణం గురించి వెతగ్గా, ఆ తర్వాతి స్థానంలో కరోనా వైరస్ నిలిచింది. గూగుల్‌లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అంశం టాప్ ట్రెండింగ్ టాపిక్‌గా నిలవగా, జూన్ 14న దేశంలో ఆల్‌టైం హైకి చేరుకుంది. అత్యధికంగా నాగాలాండ్‌లో సెర్చ్ చేయగా, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఝార్ఖండ్‌ వాసులు ఎక్కువగా సెర్చ్ చేశారు. జూన్ 21న సూర్యగ్రహణం గురించి అత్యధికంగా సెర్చ్ చేశారు. ఇండియాలో 4,550 శాతం దీని గురించి వెతికారు. అదే రోజు వచ్చిన ఫాదర్స్ డే గురించి 1,050 శాతం వెతికారు. కాగా, అంతకుముందు రెండు నెలల్లోనూ కరోనా వైరస్ న్యూస్ గురించి భారతీయులు ఎక్కువగా వెతికారు.

Updated Date - 2020-07-03T02:34:40+05:30 IST