గూగుల్ పే ద్వారా పీఎమ్ కేర్స్‌కు రూ. 124 కోట్లు

ABN , First Publish Date - 2020-07-13T21:00:56+05:30 IST

కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ సారథ్యంలో ఏర్పాటైన పీఎమ్ కేర్స్ నిధికి గూగుల్ పే ద్వారా రూ. 124 కోట్ల నిధులు అందాయని గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా తెలిపారు.

గూగుల్ పే ద్వారా పీఎమ్ కేర్స్‌కు రూ. 124 కోట్లు

న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం ప్రధాని మోదీ సారథ్యంలో ఏర్పాటైన పీఎమ్ కేర్స్ నిధికి గూగుల్ పే ద్వారా రూ. 124 కోట్ల నిధులు అందాయని గూగుల్ ఇండియా హెడ్ సంజయ్ గుప్తా తెలిపారు. దాదాపు 20 లక్షల లావాదేవీల ద్వారా ఈ మొత్తం పీఎమ్ కేర్స్‌కు చేరిందన్నారు. తొలిసారిగా ఆన్‌లైన్ విధానంలో నిర్వహిస్తున్న గూగుల్ ఇండియా ఈవెంట్ 2020లో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు గూగుల్ పే ద్వారా పీఎమ్ కేర్స్ నిధికి విరాళాలు ఇచ్చారని తెలిపారు. పీఎమ్ కేర్స్‌కు గూగుల్ పే వంటి యూపీఐ యాప్‌ ద్వారా విరాళాలిచ్చే అవకాశం ఉన్న విషయం తెలిసిందే.


కాగా.. ఈ ఈవెంట్‌లో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ప్రసంగించారు. భారత్‌లో డిజిటలీకరణ కోసం గూగుల్ చేపట్టిన చర్యలను ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా పాల్గొన్నారు. వచ్చే ఐదేళ్లలో  భారత్‌కు చెందిన వివిధ రంగాలలో గూగుల్ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుందని పిచాయ్ ఈ సందర్భంగా తెలిపారు.  

Updated Date - 2020-07-13T21:00:56+05:30 IST