‘హింగ్లీష్‌’లో గూగుల్‌ పే యాప్‌

ABN , First Publish Date - 2022-06-11T05:46:13+05:30 IST

అచ్చంగా మాతృభాషలో మాట్లాడే రోజులకు ఏనాడో కాలం చెల్లింది

‘హింగ్లీష్‌’లో గూగుల్‌ పే యాప్‌

అచ్చంగా మాతృభాషలో మాట్లాడే రోజులకు ఏనాడో కాలం చెల్లింది. హిందీ సహా అన్ని భాషలకు ఇది వర్తిస్తుంది. ఆంగ్లంతో కలిపి ప్రాంతీయ భాష మాట్లాడే వారిలో యువత ఎక్కువ. మొత్తానికి ఈ హైబ్రిడ్‌ లాంగ్వేజ్‌కి ఆదరణ ఉంది. దరిమిలా గూగుల్‌ పే హింగ్లిష్‌ అంటే హిందీ, ఇంగ్లీష్‌ కలగలిపిన లాంగ్వేజ్‌ ఆప్షన్‌ కూడా పెట్టుకుంది. ఆ ఆప్షన్‌ ఎంపిక చేసుకున్న వారికి న్యూపేమెంట్‌ కాస్తా నయా పేమెంట్‌ అని కనిపిస్తుంది. ట్రాన్సేక్షన్‌ హిస్టరీ ఆ ఆప్షన్‌లో భాగంగా ట్రాన్సేక్షన్‌ హిస్టరీ దేకిన్‌ అని చూపిస్తుంది. అలా ఇప్పటికే ఉన్న తెలుగు, కన్నడ తదితర ప్రాంతీయ భాషల సరసన ఈ హింగ్లిష్‌ చేరింది. ఐఫోన్‌, ఆండ్రాయిడ్‌ డివైస్‌లు అన్నింటిలో 


ఇది లభ్యమవుతుంది. ఇదెలా పొందవచ్చంటే...


ఆండ్రాయిడ్‌ లేదంటే ఐఫోన్‌లో మొదట గూగుల్‌ పే ని ఓపెన్‌ చేయాలి.


యాప్‌ టాప్‌ రైట్‌ కార్నర్‌లోని ప్రొఫైల్‌ పిక్చర్‌ని టాప్‌ చేయాలి.


ఇక్కడ సెట్టింగ్స్‌, పేమెంట్‌ ఇన్ఫో ఆప్షన్లు కనిపిస్తాయి.


పర్సనల్‌ ఇన్ఫో ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.


లాంగ్వేజ్‌ ఆప్షన్‌ని టాప్‌ చేసి ‘చేంజ్‌’ని సెలెక్ట్‌ చేయాలి.


ఇక్కడ లాంగ్వేజ్‌ల జాబితా కనిపిస్తుంది. 


అందులో నుంచి హింగ్లిష్‌ లేదంటే కావాల్సిన లాంగ్వేజ్‌ని ఎంపిక చేసుకోవాలి. అప్పటి నుంచి ఎంచుకున్న భాష అది హింగ్లిష్‌ అయినా మరొకటి అయినా అందులోనే ఉంచుకుని యాప్‌ని ఉపయోగించుకోవచ్చు.

Updated Date - 2022-06-11T05:46:13+05:30 IST