ఇక మీ గూగుల్ని ఐదుగురితో పంచుకోవచ్చు!

ABN , First Publish Date - 2020-02-12T23:48:22+05:30 IST

గూగుల్‌ మెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌లోని ఫైల్స్‌, గూగుల్‌ ఫొటోస్‌లోని ఇమేజ్‌లు - ఇవన్నీ వాడుకోవడానికి గూగుల్‌ వన్‌ క్లౌడ్‌ సర్వీస్‌ ని ఉపయోగిస్తూ ఉంటాం. నెలకి రూ.210 తో 200 GB స్టోరేజ్‌ని గూగుల్‌ అందిస్తోంది.

ఇక మీ గూగుల్ని ఐదుగురితో పంచుకోవచ్చు!

గూగుల్‌ మెయిల్‌, గూగుల్‌ డ్రైవ్‌లోని ఫైల్స్‌, గూగుల్‌ ఫొటోస్‌లోని ఇమేజ్‌లు - ఇవన్నీ వాడుకోవడానికి గూగుల్‌ వన్‌ క్లౌడ్‌ సర్వీస్‌ ని ఉపయోగిస్తూ ఉంటాం. నెలకి రూ.210 తో 200 GB స్టోరేజ్‌ని గూగుల్‌ అందిస్తోంది. అదే నెలకి రూ.650 పే చేయగలిగేవాళ్లకి ఏకంగా 2 TB అందిస్తోంది గూగుల్‌.అయితే చాలామందికి 200 GB సరిపోదు. అలాగని నెలకి రూ.650 కడితే - వాళ్లు ఇచ్చే 2TB ని సమర్థంగా ఉపయోగించుకోలేం. స్పేస్‌ వృథా కావచ్చు. అయితే ఇప్పుడు అలా కాకుండా గూగుల్‌ ఓ మంచి అవకాశం ఇస్తోంది.


గూగుల్‌ వన్‌ క్లౌడ్‌ సర్వీస్‌లోని మీ స్టోరేజ్‌ని ఇక మీరు అదనంగా... మీ ఐదుగురు కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. ఐదుగురు అదనంగా.. అంటే మొత్తం ఆరుగురు వాడుకోవచ్చన్నమాట. ఇందువల్ల మీ స్పేస్‌ని మీరు తగినవిధంగా ఉపయోగించుకోగలుగుతారు.


మరి స్పేస్‌ షేర్‌ చేసుకోవడం అంటే... మన ఫైల్స్‌ అన్నీ అందరికీ కనిపిస్తాయా? - అని వర్రీ కావాల్సిన పని లేదు. ఇది కేవలం స్పేస్‌ షేరింగ్‌ మాత్రమే! మన ఫైల్స్‌ మనకు మాత్రమే కనిపిస్తాయి. మరెవరకీ వాటి యాక్సెస్‌ ఉండదు. గూగుల్‌ వన్‌ స్పేస్‌ని కామన్‌ స్పేస్‌ గా అరడజను మంది వాడుకున్నప్పటికీ - ప్రత్యేకించి కావాలని మనం షేర్‌ చేసుకున్న ఫైల్స్‌ మాత్రమే - ఎవరికి షేర్‌ చేయాలనుకుంటే వారికి మాత్రమే షేర్‌ అవుతాయి. కాబట్టి నో వర్రీ! షేర్‌ ద స్పేస్‌! ఎండ్‌ ఎంజాయ్‌ గూగుల్‌ వన్‌!

Updated Date - 2020-02-12T23:48:22+05:30 IST